»   » చిరంజీవి,ఎన్టీఆర్...ఇద్దరూ రిజెక్టు చేసాకే

చిరంజీవి,ఎన్టీఆర్...ఇద్దరూ రిజెక్టు చేసాకే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:ఊరి నుంచి ఎంతో తీసుకున్నాం. తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం...అంటూ వచ్చిన చిత్రం శ్రీమంతుడు. శ్రీమంతుడు చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ఈ శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల 14లక్షలు షేర్ వసూలు చేయడం విశేషం. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ ఇంతకు ముందు ఎవరెవరకు చెప్పారనే చర్చ మొదలైంది. మహేష్‌బాబు నటించిన శ్రీమంతుడు శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకునేదాని ప్రకారం కొరటాల శివ ఈ చిత్రం కథ ని...గతంలో చిరంజీవి 150 వ చిత్రం కోసం రామ్ చరణ్ కు, చిరు కు వినిపించారు. అయితే ఇలాంటి కథలో గతంలో రుద్రవీణ చిత్రం చేసానని వారు రిజెక్టు చేసారట. అలాగే జూ.ఎన్టీఆర్ సైతం ఈ చిత్రం కథ విని బాగా మల్టిఫ్లెక్స్ మూవి అని కాదన్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ రోజు ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటూ భాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.


Chiranjeevi missed Srimanthudu

శ్రీమంతుడు కమ్మని విందుభోజనంలా వుంది. దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కించారు. డైలాగ్స్, ఫొటోగ్రఫీ, సంగీతం చాలా బాగున్నాయి అన్నారు కృష్ణ.


కృష్ణ మరిన్ని విశేషాలు తెలియజేస్తూ.... శ్రీమంతుడు విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిగా వున్నాను. సినిమాలో మహేష్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా నటించడమే కాకుండా చాలా అందంగా కనిపించాడు. మహేష్ కెరీర్‌లోనే శ్రీమంతుడు ది బెస్ట్ సినిమా అవుతుంది. అతని కెరీర్‌లోనే నెంబర్‌వన్ సినిమా ఇది. మహేష్ ఈ సినిమాతో వందశాతం ఆర్టిస్ట్‌గా నిరూపించుకున్నాడు. మహేష్ భవిష్యత్తులో కూడా శ్రీమంతుడు లాంటి ఎన్నో చిత్రాల్లో నటించాలి. నటుడిగా పెద్ద స్థాయికి చేరుకుని మంచి పేరు తెచ్చుకోవాలి. ఇంత మంచి చిత్రాన్ని ఈ మధ్య కాలంలో నేను చూడలేదు అన్నారు.


విజయనిర్మల మాట్లాడుతూ శ్రీమంతుడు సినిమా శ్రీమంతుడులాగే వుంది. మహేష్‌ను ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు. ప్రతి సన్నివేశంలోనూ మహేష్ చాలా అద్భుతంగా నటించాడు. అలా సెటిల్డ్‌గా నటించడం చాలా కష్టం. శ్రీమంతుడు గొప్ప చిత్రమవుతుంది అని తెలిపారు.

English summary
Koratala Shiva first narrated ‘Srimanthudu’ story to Ram Charan and even narrated the story to Mega Star Chiranjeevi's 150th project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu