twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    YS Jagan తో ఫిబ్రవరి 10న భేటీ.. చిరంజీవి, నాగార్జునతోపాటు ఎవరెవరు వెళ్తున్నారంటే?

    |

    ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి, తెలుగు సినిమా పరిశ్రమకు మధ్య చోటు చేసుకొన్న ప్రతిష్టంభనకు సానుకూల పరిష్కారం దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొద్ది నెలలుగా సినిమా హీరోలకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య రకరకాల వివాదాలు చోటుచేసుకోవడం మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే సినిమా పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించే ప్రయత్నించే క్రమంలో సినీ ప్రముఖులతోపాటు పలువురు నిర్మాతలు కూడా ఏపీ సీఏం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

    సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య

    సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య


    సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు, సినిమా పరిశ్రమకు రాయితీలు, అలాగే కరోనావైరస్ లాక్‌డౌన్ కాలంలో థియేటర్ల విద్యుత్ ఛార్జీల తగ్గింపు అంశాలపై గతంలో పలు దఫాలు చర్చలు జరిగాయి. అయితే ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గింపు వ్యవహారం అతి పెద్ద వివాదంగా మారింది. ఆ వివాదం అనేక మలుపు తిరుగుతూ సినీ పరిశ్రమ పెద్దలు, రాజకీయ నేతలు మంత్రులు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకోవడం అతిపెద్ద వివాదంగా మారింది.

    పవన్ కల్యాణ్, నానీ విమర్శలతో దుమారం

    పవన్ కల్యాణ్, నానీ విమర్శలతో దుమారం


    ఇక రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, మంత్రి పేర్ని నానిని ఘాటుగా విమర్శించడం అత్యంత వివాదానికి దారి తీసింది. పవన్ కల్యాణ్‌‌పై వైసీపీ నేతలు, పేర్ని నాని కూడా అంతే ఘాటుగా విమర్శలు చేయడంతో మరింత గ్యాప్ పెరిగింది. ఇక శ్యామ్ సింగరాయ్ సినిమా రిలీజ్ ఫంక్షన్‌లో హీరో నాని స్పందిస్తూ.. సినిమా థియేటర్ల కౌంటర్ల కంటే.. కిరాణషాపు కౌంటర్లు లాభాలతో నడుస్తున్నాయని చేయడంతో సినిమా పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి పెద్ద గ్యాప్ ఉందనే భావన అందరిలో కలిగింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంతో, సినీ పెద్దలు చర్చలు జరిపేందుకు సిద్దమయ్యారు.

    సమస్యల పరిష్కారానికి సీఏం జగన్‌తో చర్చలు

    సమస్యల పరిష్కారానికి సీఏం జగన్‌తో చర్చలు

    ఫిబ్రవరి 10న సినీ ప్రముఖులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం కావడానికి ఏర్పాట్ల జరుగుతున్నాయి. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలపై సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని చర్చించినట్టు సమాచారం. అలాగే సినిమా పరిశ్రమ ప్రముఖులతో ప్రభుత్వ పరంగా చర్చించాల్సిన అంశాలను సీఎం వైఎస్ జగన్‌ దృష్టికి మంత్రి పేర్ని నాని తీసుకెళ్లినట్టు సమాచారం.

    ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పేర్ని నాని భేటి

    ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పేర్ని నాని భేటి

    ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నాని జరిపిన సమావేశంలో పలు విషయాలు చర్చకు వచ్చాయి. అందులో సినిమా టికెట్ల ధర పెంపు, సినీ పరిశ్రమకు రాయితీలపై ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. అలాగే సినిమా థియేటర్లలో వసతులు, సదుపాయాల కల్పన, ఇతర అంశాలపై సమాలోచనలు జరిపారు. టికెట్ల ధర పెంపుపై అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక గురించి కూడా చర్చించారు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు.

    ఫిబ్రవరి 10న భేటికి అత్యంత ప్రాధాన్యం

    ఫిబ్రవరి 10న భేటికి అత్యంత ప్రాధాన్యం

    సినీ ప్రముఖులు చర్చల కోసం ఫిబ్రవరి 10వ తేదీన వస్తున్న నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో మరోసారి మంత్రి పేర్ని నాని రేపు (ఫిబ్రవరి 09) మరోసారి భేటి కానున్నారు. ఎల్లుండి అంటే ఫిబ్రవరి 10వ తేదీన సినీ పరిశ్రమ తరపున చర్చకు వచ్చే అంశాలను సీఎం దృష్టికి మంత్రి పేర్ని నాని తీసుకెళ్లనున్నారు అని సినీ వర్గాలు వెల్లడించాయి.

    Recommended Video

    Indirect Tweet On Ys Jagan, Tollywood Directors Twitter Battle | Filmibeat Telugu
    టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారంటే..

    టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారంటే..


    ఇదిలా ఉండగా, సినిమా పరిశ్రమ తరఫున ఏపీ సీఎంతో భేటీ కానున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, RRR మూవీ నిర్మాతలు, రాధేశ్యామ్ తరఫున యూవీ క్రియేషన్ ప్రతినిధులు పాల్గొంటారని ప్రాథమిక సమాచారం. రానున్న కొద్ది రోజుల్లో RRR, రాధేశ్యామ్ లాంటి ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు సినిమాల రిలీజ్‌కు సానుకూలంగా ఉండే నిర్ణయాలను ఏపీ ప్రభుత్వం తీసుకొంటుందనే విషయాలు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

    English summary
    Tollywood top heroes and Producers are going to deliberations with AP CM YS Jaganmohan Reddy on several issues regarding Telugu film Industry. Chiranjeevi, Nagarjuna, RRR and Radhe Shyam producers meeting with AP CM on 10th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X