For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'యాక్షన్...కట్' చెప్తూ షాట్ డైరక్ట్ చేస్తున్న చిరంజీవి (వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్: శనివారం అంటే ఈ రోజు చిరంజీవి 60వ జన్మదినం. ఈ సందర్భంగా చిరంజీవికి ఇండస్ట్రీ నుంచి,అభిమానుల నుంచి, కుటుంబం నుంచి, శ్రేయాభిలాషుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. అందులో భాగంగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘ టీమ్ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ టీజర్ విడుదల చేసారు. ఈ వీడియోలో చిరంజీవి డైరక్ట్ చేస్తూ కనిపిస్తారు.

  దశాబ్దాలుగా అభిమానుల్ని అలరిస్తున్న చిరంజీవి బాక్సాఫీసు గర్వంగా చెప్పుకొనే సినిమాలను అందించి స్టార్‌గా తిరుగులేని స్థానం సంపాదించారు. ఆ తరవాత రాజకీయాలవైపు దృష్టి సారించడంతో చిరుని వెండితెరపై చూసుకొనే అవకాశం దక్కలేదు. 'మగధీర' తరవాత మళ్లీ కెమెరా ముందుకు రాలేదు. ఇప్పుడు అందుకు రంగం సిద్ధమవుతోంది. చిరు రీఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయి.

  150 వ చిత్రం గురించి చిరంజీవి మాట్లాడుతూ...''నా 150వ చిత్రం గురించి అందరూ అడుగుతున్నారు. తప్పకుండా 150వ సినిమా ఉంటుంది. అది గ్యారెంటీ. అయితే ఎవరితో అనేది ఇంకా తేల్చుకోలేదు. ఎందుకంటే ఈ సినిమాపై ఎన్ని అంచానాలుంటాయో నాకు తెలుసు. వాటిని అందుకొనే కథ దొరకాలి. పూరి జగన్నాథ్‌తో 'ఆటోజానీ' సినిమా చేద్దామనుకొన్నా.

  Chiranjeevi on the sets of ‎Subramanyam ForSale‬

  తొలి సగం కథ బాగా వచ్చింది. సెకండాఫ్‌తో మేమిద్దరం సంతృప్తికరంగా లేం. ఈలోగా ఆయన మరో సినిమా మొదలెట్టారు. ఈలోగా ద్వితీయార్ధం చెబితే.. ఆ సినిమా ఉంటుంది. లేదంటే ఎవరు మంచి కథతో వస్తే ఆ కథ పట్టాలెక్కుతుంది. నాకైతే 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌'లా వినోదాత్మకంగా ఉండే సినిమానే చేయాలని ఉంది. అభిమానులకూ అదే కావాలి'' అన్నారు.

  ఇక సాయిధరమ్ తేజ విషయానికి వస్తే...

  రీసెంట్ గ ...పిల్లా నువ్వు లేని జీవితం అంటూ హిట్ కొట్టిన ...సాయి ధరమ్ తేజ్ చేస్తున్న మూడవ సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్ ‘. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తై ఆడియో విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ కొత్తగా కనిపించనున్నారు. ఈ మేరకు టైటీల్ సాంగ్ ని విడుదల చేసారు. ఈ టీజర్ సాయి ధరమ్ తేజ అబిమానులను అలరిస్తోంది. మీరూ ఈ వీడియో పై ఓ లుక్కేయండి.

  చిత్రం విశేషాలకు వెళ్తే...

  సాయి ధరమ్ తేజ్ సరసన రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పూర్తి కమర్షియల్ హంగులతో సినిమా తెరకెక్కిస్తున్న ఈ సినిమా సాయికి మరో హిట్ అందిస్తుందని ఈ చిత్ర టీం అంటోంది. ఇండియాలోని పలు ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమా చివరి షెడ్యూల్ ని అమెరికాలో షూట్ చేసారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.

  ''ఇప్పటివరకూ కథనే నమ్ముకొని సినిమాలు తీశాం. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' కూడా చక్కని కథతో రూపొందనున్న సినిమా. హరీశ్ శంకర్‌తో నేను తీసిన 'రామయ్య వస్తావయ్యా' అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అయినా... అతని ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ సినిమాతో సాయిధరమ్‌తేజ్ స్టార్ హీరో అవుతాడు'' అని 'దిల్' రాజు అన్నారు.

  అలాగే ..'దిల్' రాజు మాట్లాడుతూ - ''సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా ఏదీ విడుదల కాకముందే... అతను హీరోగా సినిమాను ప్రారంభించామంటే... అతనిపై, హరీశ్‌శంకర్ కథపై మాకున్న నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు.'' అని తెలిపారు.

  'మిరపకాయ్' టైమ్‌లోనే ఈ టైటిల్‌ని మీడియాకు తెలియజేశాను. అప్పట్నుంచీ ఈ కథపై కసరత్తులు చేస్తూనే ఉన్నాను. అయితే... ఎవరితో చేయాలనేది మాత్రం క్లారిటీ లేదు. 'గబ్బర్‌సింగ్' టైమ్‌లో పవన్‌కల్యాణ్‌గారితో సాయిధరమ్‌తేజ్‌ని చూశాను. తొలి చూపులోనే నచ్చేశాడు. 'పిల్లా నువ్వులేని జీవితం' ప్రోమోస్ చూశాక నా సుబ్రమణ్యం ఇతనే అని ఫిక్స్ అయిపోయాను. సీత అనే పాత్రను రెజీనా చేస్తోంది. చాలా కొత్తగా ఉంటుందా పాత్ర. సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌తో తొలిసారి పనిచేస్తున్నాను. ప్రతిభావంతులైన టీమ్ పనిచేస్తున్న వినోదాత్మక ప్రేమకథ ఇది'' అని హరీశ్‌శంకర్ తెలిపారు.

  సాయిధరమ్‌తేజ్‌. సుమన్‌, కోట శ్రీనివాసరావు, నాగబాబు, రావు రమేశ్‌, పృథ్వీ, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటించే ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే. మేయర్‌, ఫొటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, స్ర్కీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్‌ వేగేశ్న, తోట ప్రసాద్‌, సహ నిర్మాతలు: శిరీష్‌, లక్ష్మణ్‌, నిర్మాత: దిల్‌ రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీశ్‌శంకర్‌ ఎస్‌

  English summary
  Chiranjeevi on the sets of ‎Subramanyam ForSale‬. Subramanyam For Sale, Starring, Sai Dharam Tej, Regina Cassandra, directed by Harish Shankar, music composed by Mickey J Meyer& Produced by Dil Raju and Shirish, Laxman under the banner Sri Venkateswara Creations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X