For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Chiranjeevi Samantha: సమంత వ్యాధిపై చిరంజీవి రియాక్షన్.. మోటివేషనల్ గా ట్వీట్

  |

  ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయింది. తరచుగా మోటివేషనల్ కొటేషన్లు, పెట్ ఫొటోలు, పర్సనల్ విషయాలను సామాజికి మాధ్యమం ద్వారా వెల్లడించే సామ్ నుంచి ఏ ఒక్క అప్డేట్ రావట్లేదని అభిమానులు తెగ ఫీలయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తను బాధపడుతున్న వ్యాధి మయోసిటిస్ గురించి చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది. గతకొంతకాలంగా ఆ వ్యాధితో బాధపడుతున్నాని, ఈ పరిస్థితిని అర్థం చేసుకోడానికి మరికొంత సమయం పడుతుందన్న పోస్ట్ కు సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

  అటోఇమ్యునల్ వ్యాధి మయోసిటిస్ గురించి..

  అటోఇమ్యునల్ వ్యాధి మయోసిటిస్ గురించి..


  ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత అతి తక్కువ కాలంలోనే ఎనలేని స్టార్​ డమ్ ను సంపాదించుకుంది. అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సమంత ఎక్కువగా లేడీ ఒరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. ఇందులో గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం, యశోద చిత్రాలు ఉన్నాయి. ఇటీవల విడదలైన యశోద ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన సమంత సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. దానికి సంబంధించి పెట్టిన పోస్ట్ లో ఎమోషన్ ల్ గా తనకున్న అటోఇమ్యునల్ వ్యాధి మయోసిటిస్ గురించి చెప్పుకొచ్చింది.

  మనలోని శక్తిని కనిపెట్టి ..

  సమంతకు మయోసిటిస్ ఉన్నట్లు తెలియడంతో అభిమానులు, సెలబ్రిటీలు షాక్ గు గురయ్యారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు సైతం సమంత త్వరగా రికవరీ కావాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, శ్రియ, లావణ్య త్రిపాఠి, హన్సికతోపాటు అక్కినేని అఖిల్ కూడా స్పందించారు. ''ప్రియమైన సామ్. సమయం మారుతున్నకొద్ది జీవితంలో అనేక ఛాలేంజ్ లు వస్తుంటాయి. వాటిని స్వాగతించి మనలోని శక్తిని కనిపెట్టి వాటిని అధిగమించాలి. నువ్ ఒక అద్భుతమైన, దృఢమైన అమ్మాయివి. నీ లోపల గొప్ప శక్తి ఉంది. ఈ ఆటుపోటులన్నింటిని అతి త్వరలో అధిగమిస్తావని నేను చాలా గట్టి నమ్ముతున్నాను. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను'' అని ట్విటర్ వేదికగా రాసుకొచ్చారు చిరంజీవి.

  ఒక్కోసారి అంగవైకల్యం, మరణం కూడా..

  ఒక్కోసారి అంగవైకల్యం, మరణం కూడా..


  మయోసిటీస్ అనేది ప్రాణాంతక వ్యాధి. కండరాలలో వాపు రావడం, విపరీతమైన నొప్పి, బలహీనపడటం ఈ వ్యాధి లక్షణాలు. కొద్దిగా నడిచినా, నిలబడ్డా అలసిపోతారు. అలాగే శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడతారు. ఫిజికల్ థెరపీ, హీట్ థెరపీ, వ్యాయామంతో నయం చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాధితో ఒక్కోసారి అంగవైకల్యం, మరణం కూడా సంభవించ వచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం సామ్ పోస్ట్ వైరల్ గా మారింది. సమంత పోస్ట్ చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ఆమెకు దేవుడు మరింత బలం ఇవ్వాలని ప్రార్థిస్తున్నారు. అలాగే ఆమె వ్యాధి నుంచి త్వరగా బయటపడాలని #SamanthaRuthPrabhu హ్యష్ ట్యాగ్ తో ట్వీట్స్ చేస్తున్నారు.

  English summary
  Megastar Chiranjeevi Support To Actress Samantha Ruth Prabhu Over She Diagnosed With Myositis Disease.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X