twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్లాట్ ఫాం వేసా.. ప్ర్రూవ్ చేసుకో: చిరంజీవి

    By Srikanya
    |

    "బిడ్డలు సాధించిన విజయాలు చూసి ఆనందించే స్థితిలో ప్రస్తుతం నేను ఉన్నాను. తల్లి దండ్రులు పిల్లలకు ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తారంతే. కెరీర్ నిలబడాలంటే కష్టపడి వారేంటో వారే ప్ర్రూవ్ చేసుకోవాలి" అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆయన రీసెంట్ గా రవిరాజా పినిసెట్టి కుమారుడు ఆది నటించిన 'ఏకవీర'చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడారు. "అలాగే..నేను ఈ ఆడియో వేడుకకు వచ్చానంటే... నిర్మాత, దర్శకులు నాకు తెలిసి కాదు, 'ఆది' తండ్రి రవిరాజా పినిశెట్టి రమ్మనడంతో వచ్చాను. 'మృగం'లో చాలా బాగా నటించాడు ఆది. అతనికి మంచి భవిష్యత్తు ఉంది" అన్నారు.

    ఇక ఆది పినిశెట్టి హీరోగా వసంతబాలన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన 'అరవన్' చిత్రాన్ని 'ఏకవీర' పేరుతో టి.శివ తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీని చిరంజీవి ఆవిష్కరించి ప్రతిని తమిళ హీరో కార్తీకి అందించారు.

    ''సంగీత దర్శకుడిగా సాయికార్తీక్‌కి ఇది తొలి సినిమా. మంచి సంగీతం ఇచ్చాడు. పేషన్‌తో దర్శకుడు వసంత బాలన్ ఈ సినిమా తీశాడు. ఇది మా టీమ్ మొత్తం ప్రాణం పెట్టి చేసిన సినిమా'' అని ఆది పినిశెట్టి చెప్పారు. ఇక ప్లే బ్యాక్ సింగర్ కార్తిక్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం గురించి దర్సకుడు వసంత్ బాలన్ మాట్లాడుతూ.. "అరవన్ అంటే ధీరోదాత్తుడు వెన్ను చూపని వ్యక్తి, ఇంకా చెప్పాలంటే కేవలం పోరాడటానికే పుట్టిన వ్యక్తి అని అర్దం. ఇది పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన కధ. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులుకు కొత్త అనుభూతి కలిగిస్తుందనుకుంటున్నాను" అన్నారు.

    ధన్షిక, అంజరి, అర్చనకవి, శ్వేతామీనన్, విజయచందర్, పశుపతి, కరికాలన్, శృతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: అనంతశ్రీరామ్, ఫొటోగ్రఫీ: సిద్దార్ట్, సమర్పణ: టి.శివ, నిర్మాత: దామెర శ్రీనివాస్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వసంతబాలన్.

    English summary
    Aravan means a man who has all the qualities of a macho hero. The story is baserd on the 18th century and on the life and times of an ordinary Tamilian, and will have all the commercial ingredients
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X