»   »  చిరంజీవి రిలీజ్ చేసిన ‘రారా’ ఇదే...(ఫస్ట్ లుక్)

చిరంజీవి రిలీజ్ చేసిన ‘రారా’ ఇదే...(ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా శ్రీకాంత్ న‌టించిన కామెడీ అండ్ హార్ర‌ర్ మూవీ 'రారా' ఫ‌స్ట్‌లుక్‌ను బుధవారం రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా చిరంజవి మాట్లాడుతూ... ఈ సినిమా చూడాల‌ని తాను ఎంతో ఆత్రుతతో ఉన్నాన‌ని, హాస్యం, హార్ర‌ర్ జోడించి తెరకెక్కించిన ఈ చిత్రం పిల్ల‌ల‌కు కూడా బాగా న‌చ్చుతుందన్నారు.

సోదరుడు, నా తమ్ముడు శ్రీకాంత్ హీరోగా మరో సోదరుడు శ్రీమిత్ర చౌదరి ప్రజెంట్స్ వస్తున్న ఈ పిక్చర్ చూస్తేంటే నాకే ఉత్సాహంగా ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా అనిపిస్తోంది. ఇందులో చాలా తమాషాలు ఉన్నాయని చిరంజీవి తెలిపారు.

Chiranjeevi releases Srikanth’s Raa Raa movie first look

మామూలుగా హారర్ సినిమా అనే సరికి చాలా భయాందోళనగా ఉంటుంది. అలా కాకుండా ఇది హాస్యం జోడించిన హారర్ థ్రిల్లర్ ఇది. చిన్న పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంది. ఇందులో దెయ్యాలు, మనుషులకు చాలా గేమ్స్ కూడా ఉన్నాయట. ఎక్కడైనా సరే దెయ్యాలను చూసి మనుషులు భయ పడతారు, కానీ ఇక్కడ మనుషులను చూసి దెయ్యాలు భయపడే లాంటి సన్నివేశాలు ఉండటం అనేది చాలా తమాషాగా ఉందని చిరంజీవి అన్నారు.

హీరో శ్రీ‌కాంత్ మాట్లాడుతూ తాను అడ‌గ‌గానే కాద‌న‌కుండా చిరు అన్న‌య్య‌ వ‌చ్చి త‌న సినిమా ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల చేశార‌ని, ఆయ‌న‌కు తాను రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు. మార్చిలో ఈ సినిమా విడుద‌ల కాబోతోంది.

English summary
Tollywood Mega Star Chiranjeevi releases Srikanth’s Raa Raa movie first look today at Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu