»   » చిరంజీవి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట!

చిరంజీవి ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఈ సంవత్సరం రావడం లేదని తేలిపోయింది. మొన్న చిరంజీవి బర్త్ డేకి సినిమా ప్రారంభం అవుతుందని అభిమానులంతా ఆశగా ఎదురు చూసినా కథ ఫైనల్ కాక పోవడంతో సినిమా ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. అందుకే అభిమానులను మరో రకంగా సంతోష పెట్టాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు.

తన తనయుడు రామ్ చరణ్ నటిస్తున్న ‘బ్రూస్ లీ-ది ఫైటర్' సినిమాలో గెస్ట్ రోల్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో చిరంజీవి సెప్టెంబర్ 12 నుంచి పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. ఓ పాట సహా పలు కీలక సన్నివేశాల్ని మెగాస్టార్ పై చిత్రీకరించేందుకు దర్శకుడు శ్రీనువైట్ల సన్నాహాలు చేస్తున్నాడని వినిపిస్తోంది.

Chiranjeevi remuneration for Bruce Lee?

అయితే ఈ చిత్రంలో నటించినందుకు గాను చిరంజీవి ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోవడం లేదట. కొడుకు నటిస్తున్న సినిమా కోసం, అభిమానుల కోసం ఆయన ఫ్రీగా నటిస్తున్నారట. అయితే నిర్మాతలు మాత్రం ఆయనకు ఎంతో కొంత గౌరవ రెమ్యూనరేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆయన రూ. 5 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగినా అదంతా అవాస్తవమని తేల్చారు నిర్మాత దానయ్య.

చిరంజీవి ఈ సినిమాలో తన సొంత క్యారెక్టర్ నే పోషించడం విశేషం. అభిమానుల అంచనాలకి మించి చిరుని ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేసేందుకు శ్రీను వైట్ల ప్లాన్ వేస్తున్నాడని టాక్. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి దసరా కానుకగా అక్టబర్ 16న బ్రూస్ లీ ని రిలీజ్ చేసేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

English summary
DVV Danayya who is producing this movie cleared the air by saying that there were many rumors that Chiranjeevi has demanded 5 Crore to appear in Bruce Lee movie.
Please Wait while comments are loading...