»   » చిరు చించేసాడు: 150 సినిమా గురించే కాదు, స్పెషల్ డాన్స్ కూడా (వీడియో)

చిరు చించేసాడు: 150 సినిమా గురించే కాదు, స్పెషల్ డాన్స్ కూడా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆదివారం రాత్రి చిరంజీవి అభిమానులు పండగ చేసుకున్నారు. ఎందుకూ అంటే ఆయన తన 150 వ చిత్రం ఎలా ఉండబోతోంది, కాన్సెప్ట్ ఏమిటి, సినిమాలో ఏయే ఎలిమెంట్స్ ఉండబోతున్నాయో చెప్తూ చిరంజీవి ఓ వీడియోని అందించారు.

Also Read: నమ్మలేని నిజం : మెగా ఫ్యామిలీనుంచి వరస పెట్టి 16 సినిమాలు,డిటేల్స్

అలాగే ఆయన గ్యాంగ్ లీడర్ లోని టైటిల్ సాంగ్ కు శ్రీకాంత్, సునీల్ తో పాటు డాన్స్ చేసారు. అదిరిపోయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో చిరంజీవి అబిమానులు ఆనందంతో షేర్ చేస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి మరి.

ఇక తెలుగులో పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ చానల్స్‌లో ఒకటైన మాటీవీ, ఏటా సినీ మా అవార్డ్స్ పేరుతో ఆ ఏడాది వచ్చిన తెలుగు సినిమాల్లో రకరకాల విభాగాలకు సంబంధించి అవార్డులు ప్రకటిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఈ ఏడాది కూడా సంస్థ పెద్ద ఎత్తున మా అవార్డులను ఇచ్చింది.

నిన్న ఆదివారం సాయంత్రం హైద్రాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో అంగరంగ వైభవంగా ఈ అవార్డు వేడుక జరగనుంది. తెలుగు సినిమాకు సంబంధించిన స్టార్స్ హాజరు కానుండడంతో కలర్‌ఫుర్‌గా ఈ వేడుక జరగింది.

Also Read: చిరంజీవీ, బాలయ్యా పోస్టర్లు కాల్చేసారు (వీడియో)

ఇక ఈ వేడుకలో గత కొద్దిరోజులుగా ఊరిస్తున్న అతిపెద్ద విశేషం ఇక్కడ మీరు చూసిందే. ఈ వేడుకలో ప్రత్యేకంగా పర్ఫామ్ చేయటం కోసం చిరంజీవి కొద్దిరోజులుగా రిహార్సల్స్ కూడా చేస్తున్నారట.ఈ వేడుకలో చిరంజీవి డ్యాన్స్ మేజర్ హైలైట్‌గా నిలిచింది. ఇక అవార్డు వేడుక నిన్న సాయింత్రం జరిగినా, మాటీవీ ఏదైనా పండగ సందర్భంగా ఆ వేడుకను ప్రసారం చేయనుంది.

'మా' నెట్‌వర్క్ కొన్ని నెలల క్రితం 'స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' (స్టార్ టీవీ)లో భాగమైన సంగతి తెలిసిందే.ఇలా 'స్టార్ టీవీ' యాజమాన్యం కిందకు వచ్చాక, 'మా' టీవీ నిర్వహించిన తొలి సినిమా అవార్డ్స్ వేడుక ఇది. దాంతో, మునుపటి కన్నా భారీగా ఈ వేడుక జరిపారు.

Chiranjeevi rocking Dance At CineMAA Awards 2016

''ఎలాంటి మొహమాటాలకూ తావు లేకుండా, ప్రతిభ ఒక్కటే కొలమానంగా, ఉన్నత ప్రమాణాలతో ఈ 'సిని'మా' అవార్డ్స్' కార్యక్రమం నిర్వహించాం. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ సినిమా అవార్డుల పండుగను ఈసారి మరింత ప్రతిష్ఠాత్మకంగా చేస్తున్నాం. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రధాన హీరోలు, హీరోయిన్లు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొన్నారు'' అని 'మా' టీవీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.

దాదాపు అయిదు గంటల పైగా సాగిన ఈ భారీ వేడుకలో ఎవరూ ఊహించని రీతిలో ఎన్నో ఆశ్చర్యకరమైన అంశాలు, ప్రదర్శనలు ఉన్నట్లు సమాచారం. ప్రతి అవార్డుల వేడుకలో 'స్పూఫ్'లతో వినోదం పండించే 'మా' టీవీ ఈసారి కూడా అందుకు తగ్గట్లే గమ్మత్తై వ్యంగ్య వినోద ప్రదర్శనలతో ఉన్నాయి.

English summary
The highlight of the CineMaa Awards 2016 event is Chiranjeevi done a special show Live! It is a performance coupled with dance steps. This he has never done before.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu