»   » చిరు 150వ చిత్రం లాంచ్ తేదీ ఫిక్స్

చిరు 150వ చిత్రం లాంచ్ తేదీ ఫిక్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మెగా స్టార్ చిరంజీవి 150వ చిత్రం గురించి రోజుకో వార్త మీడియాలో వస్తోంది. దాంతో ఫ్యాన్స్ లోనూ, సినీ అభిమానుల్లో అనేక అనుమానాలు, ఊహాగానాలు మెదులయ్యి టెన్షన్‌కు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది పెద్ద చర్చనీయాంసంగా మారింది. అయితే ఈ చిత్రంపై ఓ స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం ప్రకారం... మార్చి 27న చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ పుట్టినరోజున ఈ చిత్ర షూటింగ్‌ ఆరంభం కానున్నట్లు తెలుస్తోంది. వి.వి. వినాయక్‌ దర్శకత్వం వహించే ఈ సినిమాకి చరణ్‌ తొలిసారి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

నయనతార హీరోయిన్ గా, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ హీరోగా తమిళంలో విడుదలై భారీ విజయం సాధించిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. చిరంజీవి, వి.వి. వినాయక్‌ కాంబినేషన్‌లో చివరి సారిగా ‘ఠాగూర్‌' చిత్రం విడుదలైంది.

Chiranjeevi's 150 movie launch on March 27th

మరో ప్రక్క ఈ చిత్రం విషయమై వివి వినాయక్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. వివి వినాయక్ తూర్పు గోదావరిజిల్లాలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం చిన్న రాజప్పతో భేటి కాగా ఈ సందర్బంగా చిరు మూవీ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. మెగా స్టార్ 150వ చిత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఉందడదని, మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను అందించే చిత్రంగా తెరకెక్కనున్నట్లు తెలిపారు.

మార్చిలో ఫస్ట్ షెడ్యూల్‌ని స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని వినాయక్ తెలియజేయగా, రామ్ చరణ్ బర్త్‌డే కానుకగా మార్చి 27న సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. లైకా ప్రొడక్షన్స్, చరణ్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ కత్తి రీమేక్‌గానే ఉంటుందని కూడా ఆయన తెలిపారు.

English summary
Chiru's 150th movie Pre-production goes on in full swing and launched on March 27th. The shoot is slated to kick start in April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu