»   »  నిరాశే: రామ్ చరణ్ ఇప్పట్లో విప్పేట్లు లేడు!

నిరాశే: రామ్ చరణ్ ఇప్పట్లో విప్పేట్లు లేడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా అభిమానులంతా చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య పూరి దర్శకత్వంలో చిరు 150వ సినిమా ఓకే అయినట్లే అయి రద్దయిన సంగతి తెలిసిందే. తర్వాత చిరంజీవి 150వ సినిమా వినాయక్ దర్శకత్వంలో ఉంటుందని, తమిళ సినిమా కత్తిని ఆయన రీమేక్ చేస్తున్నారంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఇప్పటి వరకైతే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన మాత్రం రాలేదు. దసరా తర్వాత నాన్న 150వ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పిన రామ్ చరణ్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీన్ని బట్టి చిరంజీవి 150వ సినిమాపై రామ్ చరణ్ ఇప్పట్లో నోరు విప్పేలా కనిపించడం లేదు.

Chiranjeevi's Comeback Film Shelved Again?

రామ్ చరణ్ నటించిన ‘బ్రూస్ లీ' సినిమాలో చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ సినిమా హిట్టయితే చిరంజీవి 150వ సినిమాపై అంచనాలు మరింత పెరిగేవి. కానీ దురదృష్ట వశాత్తు ‘బ్రూస్ లీ' బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. దీంతో చిరంజీవి 150వ సినిమా కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరో వైపు వివి వినాయక్ ‘అఖిల్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా దసరాకి విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాలతో ఆగిపోయింది. ఒక వేళ ‘అఖిల్' దసరాకి విడుదలయి హిట్టయి ఉంటే వివి వినాయక్ ను చిరంజీవి 150వ సినిమా దర్శకుడిగా ప్రకటించే వారేమో? కానీ అఖిల్ సినిమా వాయిదా పడటంతో చిరంజీవి 150వ సినిమా ప్రకటన కూడా వాయిదా పడిందని అంటున్నారు.

English summary
Finalizing a script for the come back film has become the most tedious task for Chiranjeevi, who had the experience of working in 149 films and ruling the industry for decades. While everything appeared on place this time as Ram Charan promised to make an announcement on the film after Dusshera, we hear that the plans are again shelved.
Please Wait while comments are loading...