»   » అల్లుడి కాళ్లు కడిగిన చిరంజీవి (శ్రీజ-కల్యాణ్ పెళ్లి వీడియో)

అల్లుడి కాళ్లు కడిగిన చిరంజీవి (శ్రీజ-కల్యాణ్ పెళ్లి వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: : జీవితం లొ ఓ అపురూప ఘట్టం వివాహం.. పచ్చని తోరణాలు.. ముత్యాల పందిరి.. వేద మంత్రాలు.. జీలకర బెల్లం...మంగళ వాద్యం..మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. సౌభాగ్య వైభోగం..బంధు జన సంద్రం.. పెద్దల ఆశీస్సులతో జంటలు ఒక్కటయ్యే మధుర జ్ఞాపకం.

మెగాస్టార్ చిరంజీవి చిన్నకూతురు శ్రీజ వివాహం ఇటీవల బెంగుళూరులో జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన జ్యువెలరీ డిజైనర్ కల్యాణ్ తో శ్రీజ వివాహం జరిగింది. పూర్తి ప్రైవేట్ సెర్మనీగా జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, కొందరు ప్రముఖులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. ఈ వీడియోలో చిరంజీవి అల్లుడికి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం, మూడు ముళ్లు, తలంబ్రాలు, జీలకర్రబెల్లం ఘట్టం లాంటివి ఆకట్టుకుంటున్నాయి.

Also See: వీడియో: పెద్ద కూతురుతో చిరు సూపర్ డాన్స్ @ శ్రీజ సంగీత్

శ్రీజ పెళ్లి వేడుక సందర్భంగా డెకరేషన్స్ అద్భుతంగా చేసారు. వెడ్డింగ్ డెకరేషన్స్‌కు పేరుగాంచిన 'దినాజ్' ఆధ్వర్యంలో డెకేషన్ అదిరిపోయింది. ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, కొందరు ప్రముఖులు దాదాపు 250 మంది ప్రముఖులు ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. ఇక శ్రీజను ప్రముఖ స్టైలిస్ట్ ఇంద్రాక్షి పట్నాయక్ అద్భుతంగా తయారు చేసారు. ఒక మెగా ఫ్యామిలీ మొత్తం ఎంథటిక్ వేర్ లో దర్శనిమిచ్చారు.

వివాహం అనంతరం నూతన వధూవరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మార్చి 31వ తేదీన హైదరాబాద్ లోని పార్క్ హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ జరుగబోతోంది. ఈ వేడుకకు దేశంలోని సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

స్లైడ్ షోలో పెళ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు, వీడియో.....

శ్రీజ-కళ్యాణ్

శ్రీజ-కళ్యాణ్

శ్రీజ-కళ్యాణ్ వివాహం ఇటీవల బెంగుళూరులోని మెగా కుటుంబీకుల ఫాంహౌస్ లో గ్రాండ్ గా జరిగింది.

కాళ్లు కడిగి కన్యాదానం

కాళ్లు కడిగి కన్యాదానం

పెళ్లి వేడుకలో భాగంగా అల్లుడి కాళ్లు కడిగి కన్యాదానం చేస్తున్న చిరంజీవి దంపతులు. కన్యాదానం లక్ష్యం ఒక్కటే. పుట్టింట్లో లభించిన ప్రేమాభిమానాలు, రక్షణ, ప్రోత్సహకాలు అత్తింట్లోనూ నిరాటకంగా లభించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం.

జీలకర్ర బెల్లం

జీలకర్ర బెల్లం

వివాహంలో సరిగ్గా ముహూర్తం వేళకు పురోహితుడు జీలకర్ర, బెల్లం కలిపిన మిశ్రమాన్ని వధూవరులిద్దరూ ఒకరి తలమీద ఒకరు ఉంచేలా చేస్తారు. శాస్త్రరీత్యా ఈ 'గుడజీరక' మిశ్రమానికి బ్రహ్మరంధ్రాన్ని తెరిపించే శక్తి ఉంటుందట.

మధుర జ్ఞాపకం

మధుర జ్ఞాపకం

జీవితం లొ ఓ అపురూప ఘట్టం వివాహం.. పచ్చని తోరణాలు.. ముత్యాల పందిరి.. వేద మంత్రాలు.. జీలకర బెల్లం...మంగళ వాద్యం..మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. సౌభాగ్య వైభోగం..బంధు జన సంద్రం.. పెద్దల ఆశీస్సులతో జంటలు ఒక్కటయ్యే మధుర జ్ఞాపకం.

అసాధారణమైన అనుభూతి

అసాధారణమైన అనుభూతి

కళ్యాణం! అనే పదంలో ఎంతో మధురంగా వుంటుంది. ప్రతీ మనిషి జీవితంలోను ఒకే ఒక్కసారి జరిగే ఈ వేడుక జీవితానికంతటికీ మరచిపోలేని మధురమైన స్మృతిగా మిగిలిపోతుంది. ఈ అద్బ్జుత క్షణం ఒక అసాధరణమైన, అనుభూతి.

మనిషి జీవితానికి పరిపూర్ణత

మనిషి జీవితానికి పరిపూర్ణత

ఈకళ్యాణ్ ఘఢియ తరువాతే మనిషి జీవితానికి ఒక పరిపూర్ణత లభిస్తుంది. భాద్యత యుతమైన పౌరుడిగా కుటుంబంలోను, అటు సంఘములోను కూడా ఒక గుర్తింపును కలగ జేసేది కళ్యాణమే!

అదే పరమార్థం

అదే పరమార్థం

ఎన్నెన్నో సుఖాలు, కష్త్టాలు, ఆనందాలు, అనుభూతులు వీటన్నింటిని ఒకరికొకరు సమానంగా పంచుకిని జీవన గమ్యాన్ని సాగించడమే ఈ కళ్యాణంవెనుక ఉన్న పరమార్హ్దం. ఇందులో చదివే ప్రతి వేద మంత్రాక్షరం వెనుక ఉన్న అర్ధమూ ఇదే!

మెుగా ఫ్యామిలీ

మెుగా ఫ్యామిలీ

శ్రీజ వివాహం సందర్భంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎంథటిక్ వేర్ లో దర్శనమిచ్చారు.

వెడ్డింగ్ వీడియో

శ్రీజ, కళ్యాణ్ వెడ్డింగ్ వీడియో...

టీజర్

శ్రీజ-కళ్యాణ్ వెడ్డింగ్ టీజర్

English summary
Chiranjeevi's younger daughter Srija got married to Kalyan, a Hyderabad based jewelry designer, on 28 March, in a private ceremony at the family's farm-house in Bangalore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu