»   »  చిరంజీవి కూతురుకు విడాకులు, అమెరికాలో కొత్త జీవితం!

చిరంజీవి కూతురుకు విడాకులు, అమెరికాలో కొత్త జీవితం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహరం గురించి అందరికీ తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న శ్రీజ....కొంత కాలం అతనితో కాపురం చేసి ఓ బిడ్డకు తల్లయింది. ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ అసలు రూపం తెలుసుకుని అతనికి దూరమైంది. విడాకుల కోసం కోర్టుకెక్కింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీజ, శిరీష్ భరద్వాజ్‌లకు కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. వీరికి పుట్టిన పాప ఆలనా పాలన కోర్టు శ్రీజకే అప్పగించినట్లు తెలుస్తోంది. విడాకుల అనంతరం శ్రీజ అమెరికాకు వెళ్లాలనే ఆలోచనలో ఉందని, అక్కడ మళ్లీ కొత్త జీవితం మొదలు పెట్టాలనే ప్లాన్లో ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

Chiranjeevi's daughter Srija divorce

శ్రీజ గతంలలో హైదరాబాద్ లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో తన భర్త శిరీష్ భరద్వాజ్ కట్నం కోసం వేధిస్తున్నాడంటూ చాలా స్ట్రాంగ్ గా కేసుపెట్టింది. దీంతో భరద్వాజ్ నీ, అతని తల్లిదండ్రులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత కాలం తర్వాత శిరీష్ భరద్వాజ్ బెయిల్ పై విడుదల అయ్యారు.

గత కొంత కాలంగా విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టు వీరు మళ్లీ కలిసుండాలని చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో విడాకులు మంజూరు చేసింది. కలిసి ఉండటానికి శ్రీజ, భరద్వాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సుముఖత చూపలేదని, వాడాకులు కావాలనే విషయంలో ఇద్దరూ స్ట్రాంగ్‌గా ఉండటంతో కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.

English summary
Chiranjeevi's daughter Srija divorce from her husband Sirish Bharadwaj. According to reports, Srija is all set to shift base to America, where she will start her new life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu