»   » డేట్ ఫిక్స్ చేసిన మెగాస్టార్, శెలవులో రామ్ చరణ్

డేట్ ఫిక్స్ చేసిన మెగాస్టార్, శెలవులో రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎప్పుడా ఎప్పుడా అని మెగాభిమానులు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి తేది ఖరారు చేసేసారు. ఇదంతా దేనికోసం అనుకుంటున్నారా..

ఇదంతా చిరంజీవి చిన్న కూతురు పెళ్లికి సంబందించిన మూహుర్తం గురించే. కళ్యాణ్, శ్రీజ పెళ్లి మార్చ్ 28న జరగనుందని తెలిపారు చిరంజీవి ఫ్యామిలి, అటు కళ్యాణ్ తరపు వారుకూడా తెలిపారు.

Also Read: శ్రీజ రెండో పెళ్లి: చిరు అల్లుడి గురించి పూర్తి డిటేల్స్..

ఈ పెళ్లి కోసం రామ్ చరణ్ కూడా తన సినిమా తని ఓరువన్ షూటింగ్ కూడా సెలవు పెట్టి పెళ్లి పనుల్లో పాలుపంచుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ వివాహం అభిమానులకు కూడా చాలా ఆనందం కలిగించే విషయం.

Chiranjeevi's Doughter sreeja wedding on 28th March

శ్రీజ పెళ్లాడే వ్యక్తి పేరు కళ్యాణ్. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిషన్ కుమారుడు. బిట్స్ పిలానిలో వీరు చదువుకున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....శ్రీజ, కళ్యాణ్ క్లాస్‌మేట్స్ కూడా.

కళ్యాణ్ ను పెళ్లాడటం ద్వారా శ్రీజ మళ్లీ కొత్తగా తన జీవితం ప్రారంభించబోతోంది. ఇన్నాళ్లు తన కూతురు భవిష్యత్తుపై చిరంజీవి కాస్త బెంగగా ఉండే వారు. ఇపుడు ఆమె రెండో పెళ్లి ద్వారా కొత్త జీవితం ప్రారంభిస్తుండటంపై ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉన్నారని అంటున్నారు.

English summary
Chiranjeevi's youngest daughter Srija will now be marrying a businessman Kanuganti Kalyan on 28th March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu