»   » చిరు 150:ఓ ప్రక్క ఫ్యాన్స్ ఇలా, వరుణ్ తేజ అలా

చిరు 150:ఓ ప్రక్క ఫ్యాన్స్ ఇలా, వరుణ్ తేజ అలా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవిని మళ్లీ వెండితెరపై చూడాలన్న మెగా అభిమానుల కోరిక త్వరలో నెరవేరబోతున్న సంగతి తెలిసిందే. చిరు హీరోగా నటించనున్న 150వ చిత్రానికి రంగం సిద్ధమైనా ప్రారంభం ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సగటు అభిమాని ఆశ తీరబోతోంది.

తమిళంలో విజయ్‌ నటించిన 'కత్తి' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న చిరు తాజా చిత్రాన్ని ప్రారంభించేందుకు ఈనెల 29న మధ్యాహ్నం 1.30 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ సినిమాకు ప్రస్తుతం 'కత్తిలాంటోడు' అనే టైటిల్‌ను అనుకుంటున్నారు. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించనున్నారు.

Chiranjeevi's Kaththilantodu Fan made poster

ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ఫ్యాన్స్ తయారు చేసి వదిలారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు చిరంజీవి అభిమానులను ఎంతగానో అలరిస్తూ ముందుకు వెళ్తోంది. విజయ్ ..కత్తి పోస్టర్ ని గుర్తు చేసేలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు.

మరో ప్రక్క...చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు, నటుడు వరుణ్‌తేజ్‌తో కలిసి ఒక ఫొటోకు పోజిచ్చారు. ఈ ఫొటోలో చిరు, వరుణ్‌తేజ్‌ ఇద్దరు కలిసి తమ చేతి వేళ్లను 150 ఆకారం వచ్చేలా అమర్చారు.

వరుణ్‌తేజ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ ఫొటోను అభిమానులతో పంచుకుంటూ... చిరు 150కి రెడీగా ఉండండి అంటూ ట్వీట్‌ చేశారు. వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Using Chiru's old photo, a fan made poster for 'Kaththilantodu', Chiranjeevi's new movie that is to be directed by V V Vinayak.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu