»   » చిరంజీవి షష్టి పూర్తి: ఫ్యాన్స్ నిర్ణయాలు...పోగ్రామ్ లు ఇవే

చిరంజీవి షష్టి పూర్తి: ఫ్యాన్స్ నిర్ణయాలు...పోగ్రామ్ లు ఇవే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం 59 వయసులో ఉన్న చిరంజీవి ఈ ఏడాది ఆగస్టు 22 నాటికి 60వ వసంతంలోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి దంపతుల షష్టిపూర్తి ఘనంగా నిర్వహించాలని మెగా అభిమానులు, ఫ్యామిలీ మెంబర్స్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆగస్టు 15 నుంచి ఆగస్టు 22 దాకా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటానికి నిర్ణయించారు. అందుతున్న సమాచారం ప్రకారం..షష్టి పూర్తి ఉత్సవం...గచ్చి బౌలి స్టేడియంలో జరుగుతుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ షష్టి పూర్తి మహోత్సవం నేపధ్యంలో ... బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్, కిడ్ని డొనేషన్ క్యాంప్ లు రాష్ట్ర వాప్తంగా చిరంజీవి యువత నిర్వహిస్తున్నారు. ఈ పోగ్రామ్స్ సక్రమంగా, ప్లానింగ్ ప్రకారం నిర్వహించేందుకు అనువుగా ఏలూరులో చిరంజీవి ఆల్ ఇండియా యూత్ కలిసి...డిస్కస్ చేసుకున్నారు. అందులో తీసుకున్న నిర్ణయాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి.

స్లైడ్ షోలో... వాళ్లు తీసుకున్న నిర్ణయాలు..కార్యక్రమాలు

మెగా ఫ్యాన్స్ డే

మెగా ఫ్యాన్స్ డే

ఆగస్టు 22న ...ప్రతీ సంవత్సరం మెగా ఫ్యాన్స్ డే గా ప్రకటించి జరపాలి.

సన్మానం

సన్మానం

ఆల్ ఇండియా చిరంజీవి యూత్...1000 మంది...వివిధ ఫీల్డ్ లో ప్రముఖులకు సన్మాం చేస్తారు. అంబడి రాయుడు(క్రికెట్), సైనా నెహ్వాల్(బ్యాడ్ మెంటెన్), సానియా మీర్జా (టెన్నిస్), ఎమ్ఎల్ సి రాము సూర్యారావు ఇలా చాలా మందిని ఈ పుట్టిన రోజున సన్మానించనున్నారు.

గోల్డ్ మెడల్స్

గోల్డ్ మెడల్స్

చిరంజీవి ...తన అభిమానులలో ఎక్కువ సార్లు రక్త దానం చేసిన వారికి గోల్డ్ మెడల్స్ ఇస్తారు. అందు నిమిత్తం వెయ్యి మంది అభిమానులను ఎంపిక చేసారు.

గిప్ట్ లు

గిప్ట్ లు

పది, ఇంటర్, ఎమ్ సెట్ లలో టాప్ ర్యాంక్ లు తెచ్చుకున్న వారికి గిఫ్ట్ లు ప్రెజెంట్ చేస్తారు

ఉద్యమం

ఉద్యమం

కల్తి పై అభిమానులు ఓ ఉద్యమం నిర్వహిస్తారు.

ఏర్పాట్లు అన్నీ

ఏర్పాట్లు అన్నీ

రామ్ చరణ్, నాగబాబు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటారని తెలుస్తోంది.

ఫెరఫెక్ట్ ప్లానింగ్

ఫెరఫెక్ట్ ప్లానింగ్

సమయం తక్కువ ఉండటంతో ఇప్పటి నుండే పర్ ఫెక్ట్ ప్లానింగ్ తయారు చేసుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం ఫ్యాన్స్ తో చర్చలు జరుపుతున్నారు.

వివాహంలా

వివాహంలా

బంధువులు, ప్రముఖులు హాజరయ్యే ఈ వేడుక వివాహ మహోత్సవాన్ని తలపించేలా ఉంటుందని అంటున్నారు.

English summary
Chiranjeevi will turn 60 this year on August 22 and as part of his sashtipurthi celebrations, special events are organized from August 15 to August 22. Recently some fans of the mega star conducted meeting at Eluru to discuss things. Details of the meeting and resolutions taken are given below.
Please Wait while comments are loading...