Just In
- 41 min ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
- 10 hrs ago
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- 11 hrs ago
క్యూట్ ఫోటోతో ఫిదా చేసేశాడు.. అభిజిత్ చిన్న నాటి ఫోటో వైరల్
- 12 hrs ago
ఓవర్ యాక్షన్ చేయకు!.. శివజ్యోతిపై రవికృష్ణ సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- Finance
20 ఏళ్లలో రూ.196 లక్షల కోట్లకు మార్కెట్ క్యాప్! సెన్సెక్స్‌ను ప్రభావితం చేసిన అంశాలివే
- News
100 రోజుల ఛాలెంజ్: మహమ్మారి నిర్మూలనకు బిడెన్ చెప్పిన చిట్కా: కొత్త టాస్క్
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఏపీ ప్రభుత్వం సినిమా రిస్టార్ట్ ప్యాకేజీ: సీఎం జగన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు
కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం మొత్తం విలవిల్లాడింది. ఇండియాలో లాక్‌డౌన్ కారణంగా చాలా పరిశ్రమలు మూతపడిపోయాయి. అందులో సినీ పరిశ్రమ కూడా ఉంది. దాదాపు ఎనిమిది నెలల పాటు షూటింగులు ఆగిపోయాయి. దీంతో చాలా మంది నిర్మాతలు నష్టాలను ఎదుర్కొన్నారు. అదే సమయంలో సినిమా థియేటర్లు కూడా క్లోజ్ అయిపోయాయి. దీని వల్ల సినిమా హాళ్ల యాజమాన్యలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లింది. దీని వల్ల ప్రభుత్వాల నుంచి పర్మీషన్లు వచ్చినా థియేటర్లను పున: ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. కొన్నైతే శాశ్వతంగా మూతపడ్డాయి.
కరోనా కారణంగా నష్టాలను ఎదుర్కొంటోన్న సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఇండస్ట్రీ కోసం రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారు. ఇందులో భాగంగా 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు, దీని ద్వారా నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. అంతేకాదు, థియేటర్ యాజమాన్యాలకు వర్కింగ్ క్యాపిటల్ రుణాలు కూడా ప్రకటించింది.

సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'కరోనా సమయంలో నష్టపోయిన ఎగ్జిబిటర్స్ కోసం సినిమా రిసార్ట్ ప్యాకేజీని ప్రకటించిన ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. సినిమా థియేటర్ల పునరుద్దరణ కోసం అనేక చర్యలు చేపట్టాలి. సినిమా పరిశ్రమ మీద వేలాది మంది కుటుంబ సభ్యులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. దీని ద్వారా వారికి జీవనోపాధి లభిస్తుంది' అని ఆయన పోస్ట్ చేశారు.