For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చిరంజీవి సెల్ఫ్‌డబ్బా కామెంట్స్ వైరల్: నా బ్యాగ్రౌండ్ తెలీదు.. వాళ్లే హీరోలు అనుకుంటున్నారంటూ!

  |

  దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్‌తో తిరుగులేని శక్తిగా ఎదిగారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమ కోసం ఎన్నో అద్భుతమైన పనులు చేస్తున్నారు. అలాగే, జర్నలిస్టులతో సైతం ఎంతో సన్నిహితంగా ఉంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా చిరంజీవి ఓ పుస్తక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ సరదా సంఘటన గురించి మీడియాతో పంచుకున్నారు. ఆ వివరాలు మీకోసం!

  శూన్యం నుంచి శిఖరాగ్రాలకు

  శూన్యం నుంచి శిఖరాగ్రాలకు

  సినీ నటుల ప్రయాణం, ప్రస్థానాన్ని వివరిస్తూ ప్రముఖ జర్నలిస్టు ప్రభు 'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు' అనే బుక్‌ను రాశారు. దీన్ని శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఆయనతో పాటు మురళి మోహన్, తమ్మారెడ్డి, దాసరి అరుణ్ సహా పలువురు ప్రముఖులు, పలు సంస్థలకు చెందిన జర్నలిస్టులు ఈ కార్యక్రమానికి వచ్చారు.

  డెలివరీ తర్వాత షాకింగ్‌గా సోనమ్: ఎద అందాలు చూపిస్తూ దారుణంగా!

  జర్నలిజం బాగుందని చెప్పి

  జర్నలిజం బాగుందని చెప్పి


  'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు' పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు జర్నలిస్టులపై ప్రశంసల వర్షం కురిపించారు. 'కొంత మంది చెప్పినట్లు మన తెలుగు జర్నలిస్టుల మధ్య ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. వీళ్లు ఏనాడూ నటీనటులన నొప్పించే విధంగా రాయరు. ఆ విషయంలో అందరినీ అభినందించాల్సిందే' అని పేర్కొన్నారు.

  ఫ్యామిలీ మెంబర్‌గానే వచ్చా

  ఫ్యామిలీ మెంబర్‌గానే వచ్చా


  'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు' పుస్తకం లాంచ్ చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. 'మునపటి తరం నటీనటుల గురించి ఇప్పటి జనరేషన్ వాళ్లకు తెలియడం లేదు. కాబట్టి ఇలంటి పుస్తకాలు ప్రస్తుత కాలంలో చాలా అవసరం. సినిమా దిగ్గజాల గురించి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ఈ బుక్ రాసిన ప్రభుకు నా అభినందనలు' అంటూ చెప్పుకొచ్చారు.

  Nitya Menon Pregnant: పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్న నిత్యమీనన్.. బిడ్డకు తండ్రి ఎవరంటే?

  చరణ్, బన్నీలే హీరోలు అని

  చరణ్, బన్నీలే హీరోలు అని


  ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. 'ప్రస్తుత తరానికి ముందు తరం సినిమా దిగ్గజాల గురించి తెలియడం లేదు. దానికి తానే ఉదాహరణ. మా ఇంట్లో ఉన్న ఎనిమిదేళ్లు, తొమ్మిదేళ్లు, ఐదేళ్ల మనవరాళ్లు.. ఎంతసేపటికీ రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్‌లనే హీరోలుగా ఫీలవుతుంటారు. వాళ్ల పాటలనే ఎక్కువగా చూస్తున్నారు' అని తెలిపారు.

  నా కడుపు మండిపోతుండేది

  నా కడుపు మండిపోతుండేది


  ఆ తర్వాత చిరంజీవి కంటిన్యూ చేస్తూ.. 'ఆ పిల్లలు చేస్తున్నది చూస్తుంటే నాకు ఎక్కడో కడుపు మండిపోతుండేది. అందుకే, నా గురించి నేనే పిల్లల దగ్గర చెప్పుకున్నాను. ఎవరూ లేని సమయంలో వాళ్ల ముందు నా సెల్ఫ్‌డబ్బా కొట్టుకున్నాను. తర్వాత నా ఎవర్‌గ్రీన్ పాటలను పిల్లలకు వేసి చూపించాను. దీంతో వాళ్లు అది నువ్వేనా అని అడగడంతో అన్ని చెప్పా' అన్నారు.

  బాత్‌టబ్‌లో అరాచకంగా దీపికా పదుకొనె: హాట్ షోలో గీత దాటేసిందిగా!

  గాడ్ ఫాదర్ నాలుగు సార్లు

  గాడ్ ఫాదర్ నాలుగు సార్లు


  అనంతరం చిరంజీవి కొనసాగిస్తూ.. 'నా గురించి తెలిసిన తర్వాత నా మనవరాళ్లు ఆశ్చర్యపోయినట్లు చూసేవాళ్లు. ఆ తర్వాత వాళ్లు గాడ్ ఫాదర్ సినిమాను ఏకంగా నాలుగు సార్లు చూశారు. అప్పుడు నేను ఆ సినిమాలో పిల్లలకు నచ్చే అంశాలు లేవు కదా అని వాళ్లను అడిగాను. దీంతో వాళ్లు సినిమా చాలా బాగుంది.. అందుకే చూస్తున్నాం అని చెప్పారు' అంటూ వెల్లడించారు.

  సెల్ఫ్‌డబ్బా కొట్టుకున్నాను

  సెల్ఫ్‌డబ్బా కొట్టుకున్నాను


  ఈ సరదా సంఘటన గురించి చిరంజీవి చెబుతూ.. 'ఇలా నన్ను నేను చెప్పుకోడానికి సెల్ఫ్‌డబ్బా కొట్టుకోవాల్సి వచ్చింది. అందుకే ఇలాంటి పుస్తకాలు ప్రస్తుత తరానికి చాలా అవసరం. రెండు తరాలు గడిచిపోయే సరికి మన దిగ్గజాల గురించి చాలా మంది మరిచిపోతున్నారు. అలాంటి వాళ్ల గురించి చెప్పడానికి ప్రభు పూనుకోవడం అభినందనీయం' అని ప్రశంసించారాయన.

  English summary
  Megastar Chiranjeevi Recently Participated in Shunyam Nundi Shikharaagraalaku Book Release Event. He Shares Funny Incident about Grandchildren.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X