twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పదవి కోసం అంత లోకువా? ఆ వ్యక్తి గుర్తుపెట్టుకొని వైద్యం చేయిద్దాం.. మీడియాకు ఆహారం కావొద్దు: చిరంజీవి ఘాటుగా

    |

    ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో దుర్గ దర్వకత్వంలో రూపొందిన పెళ్లిసందD చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో విక్టరీ వెంకటేష్ కూడా ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ఈ చిత్రం వేడుక ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ..

    రాఘవేంద్రరావుది 16 ఏళ్ల వయసే

    రాఘవేంద్రరావుది 16 ఏళ్ల వయసే


    పదహారేళ్ల వయసు సినిమా తీసిన దర్శకుడు రాఘవేంద్రరావు వయసు అక్కడే ఆగిపోయింది. ఆయన మనసును స్కానింగ్ తీస్తే వయసు 16 ఏళ్లే అని కనిపిస్తుంది. రాఘవేంద్రరావు మనసు చాలా రొమాంటిక్. ఆయన తీసే సినిమాలు ఒక ఎలా ఉంటోయో మీకు తెలియనిది కాదు అని చిరంజీవి అన్నారు.

    విక్టరీ వెంకటేష్‌పై చిరంజీవి ఆప్యాయంగా

    విక్టరీ వెంకటేష్‌పై చిరంజీవి ఆప్యాయంగా


    నా చిరకాలమిత్రుడు విక్టరీ వెంకటేష్‌తో ఈ వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవల ఆయన నారప్ప సినిమా చూసి నాకు హ్యాపీగా అనిపించింది. వెంకటేష్ ఎక్కడ కనిపించలేదు. నారప్ప పాత్రనే కనిపించింది. నేను నటించిన సైరా సినిమా ఆయనకు నచ్చింది. నాతో తన అనుభూతిని పంచుకొన్నారు అని చిరంజీవి అన్నారు.

    శ్రీకాంత్ కొడుకు నాకు బిడ్డ లాంటి వాడు

    శ్రీకాంత్ కొడుకు నాకు బిడ్డ లాంటి వాడు


    ఇక శ్రీకాంత్ కొడుకు రోషన్ నా బిడ్డలాంటి వాడు. నా సోదరుడు శ్రీకాంత్ కుమారుడైన రోషన్ నన్ను పెదనాన్న అంటారు. కానీ ఈ రోజు స్టేజ్ మీద నుంచి చిరంజీవి గారు అని పేరు పెట్టి పిలిచాడు. నీవు నన్ను పేరు పెట్టి పిలిచే వాడివి అయ్యావా అంటూ చిరంజీవి అన్నారు. శ్రీకాంత్ భార్య ఊహను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇదేనా నీ పెంపకం అంటూ సరదా ఆటపట్టించాడు.

    మాటలు అనుకోవడం

    మాటలు అనుకోవడం

    పదవుల అనేవి చిన్న చిన్న బాధ్యతల్లాంటివి. వాటి కోసం మనం మాటలు అనుకోవడం చూస్తుంటే బయట వారికి ఎంత లోకువ అనిపిస్తుందో గుర్తుంచుకోవాలి. మనంమంత కలిసి ఉంటే వసుదైక కుటుంబం అవుతాం. తాత్కాలికమైన పదవుల కోసం దిగజారవద్దు అని చిరంజీవి అన్నారు.

    మాటలు అనుకోవడం

    మాటలు అనుకోవడం


    పదవుల అనేవి చిన్న చిన్న బాధ్యతల్లాంటివి. వాటి కోసం మనం మాటలు అనుకోవడం చూస్తుంటే బయట వారికి ఎంత లోకువ అనిపిస్తుందో గుర్తుంచుకోవాలి. మనంమంత కలిసి ఉంటే వసుదైక కుటుంబం అవుతాం. తాత్కాలికమైన పదవుల కోసం దిగజారవద్దు అని చిరంజీవి అన్నారు.

    Recommended Video

    మా ఎలక్షన్ లో ఒక్క ఓటుకు పది వేలు..! - నాగబాబు
     ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి.. వైద్యం చేయిద్దాం

    ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోండి.. వైద్యం చేయిద్దాం


    పదవుల కోసం, తమ అధిపత్యం కోసం ఎదుటి వారిని కించపరచాలా? ఎక్కడ స్టార్ట్ అయిందో గుర్తుంచుకోండి. ఎవరి వల్ల ఈ వివాదం మొదలైందో గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తికి హోమియోపతి వైద్యం చేయించాలి. హోమియోపతి వైద్యం మూలాల నుంచి నయం చేస్తుంది. ముఖ్యంగా మన దిగజారుడుతనం వల్ల మీడియా వారికి ఆహారం అయిపోకూడదు అని చిరంజీవి ఘాటుగా స్పందించారు.

    English summary
    Chiranjeevi sharp criticism on MAA Elections at PellisandaD pre release event. He made verbal attack on VK Naresh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X