»   » అదిరిపోయింది కదా‌: చిరు, అమితాబ్, సూర్య...వీళ్లంతా ఒకే సినిమా కోసం

అదిరిపోయింది కదా‌: చిరు, అమితాబ్, సూర్య...వీళ్లంతా ఒకే సినిమా కోసం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఇద్దరు మెగాస్టార్స్ లు ఒకే సినిమా కోసం పనిచేయటం చాలా చాలా అరుదైన విషయం. అలాంటి అరుదైన విషయం దగ్గుపాటి రానా తాజా చిత్రం విషయంలో నిజం కాబోతోంది. ఆ వార్తే సినిమాకు క్రేజ్ చెచ్చిపెడుతోంది.

వివరాల్లోకి వెళితే...రానా కీలకపాత్రలో నటించిన చిత్రం 'ఘాజీ'. సంకల్ప్‌రెడ్డి దర్శకుడు. అతుల్‌ కులకర్ణి, కె.కె. మేనన్‌, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో దీనిని తెరకెక్కించారు. యుద్ధం నేపథ్యంలో అదీ తెలుగులో వచ్చిన చాలా తక్కువ చిత్రాల్లో 'ఘాజీ' ప్రత్యేకం. ఎందుకంటే భారత సినీ చరిత్రలో సబ్‌మెరైన్‌ నేపథ్యంలో సాగే తొలి చిత్రం ఇదే. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ అందరి అంచనాలను పెంచేసింది.

ఇందులోని కొన్ని సన్నివేశాలను చూసిన బిగ్‌ బి అమితాబ్‌ ఈ చిత్రంలోని కథ, పాత్రలను పరిచయం చేసేందుకు వాయిస్‌ ఓవర్‌ చెప్పడానికి ముందుకు వచ్చారు. ఇక తెలుగులో ఆ బాధ్యతలను చిరంజీవి చేపట్టారు. తమిళంలో సూర్య తన స్వరంతో సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తారు.

Chiranjeevi, Surya, Amithab for Ghazi movie

బాహుబలి 2తో పాటే 1971లో మునిగిపోయిన పాకిస్థాన్ సబ్ మెరైన్ కథతో తెరకెక్కుతున్న ఘాజీ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. రానా నావీ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమాతో సంకల్ప రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఎప్పుడో షూటింగ్ పూర్తయినా భారీగా గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో కాస్త ఎక్కువ టైమే పట్టింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలో తాప్సీ, కెకె మీనన్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

English summary
Amitabh Bachchan and Chiranjeevi have come together for 'Ghazi'. Both these Megastars agreed to lend voice for this first of its kind film in India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu