twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనం ఎక్జిట్ ఇవ్వకపోతే వారికి అవకాశాలు రావు : చిరంజీవి

    By Srikanya
    |

    మనం ఎక్జిట్ ఇవ్వకపోతే వారికి అవకాశాలు రావు కదా.బద్రినాద్ గొప్ప సినిమా అవుతుందనిపిస్తుంది.ఈ సినిమా మగధీర కు తగ్గదని అనుకుంటాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నిన్న(శనివారం) రాత్రి జరిగిన 'బద్రినాథ్‌' చిత్ర ఆడియో వేడుకలో ఆయన ఛీఫ్ గెస్ట్ గా పాల్గొని ఇలా వ్యాఖ్యానించారు.అలాగే మగధీర, బద్రినాథ్‌ చిత్రాలను చూస్తుంటే నేను ఏదైనా దూరం చేసుకొంటున్నానా అనిపిస్తుంటుందన్నారు.మమ్మల్ని ముందుకు నడిపించే శక్తి అభిమానులే. నా తరవాతి తరాన్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. మంచి చిత్రం చేసేందుకు బన్నీ కష్టపడతాడు. వినాయక్‌ ఈ సినిమాను ఎంతో క్రమశిక్షణతో తెరకెక్కించారు. రచయిత చిన్నికృష్ణ కథ చెబుతుంటే తొలి కాపీ చూసినట్లు అనిపిస్తుందన్నారు.

    పవన్ కళ్యాణ్ షూటింగ్ లో ఉన్నందున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలేకపోయారు. మీరు అడిగారని పవన్ చెబుతాను. గీతా ఆర్ట్స సంబంధం అది బావ, అవినాభావ సంబందం. నేను ఈ స్థాయిలో ఉండడానికి గీతా ఆర్ట్స్ అనుబంధాన్ని మర్చిపోను. అల్లు అరవింద్ ను జీవితంలో మర్చిపోలేను. గీతా ఆర్ట్స్ వేదిక మీద ఎంతో మంది ఆర్ట్సిస్ట్స్ పేరు తెచ్చుకున్నారు.ఎందరో అభిమానులు మా కుటుంబం పట్ల ఆదరణ చూపడం సంతోషంగా ఉంది.

    చిరంజీవి ప్రసంగిస్తుండగా అభిమానులు 'సీఎమ్‌... సీఎమ్‌...' అని నినాదాలు చేశారు. వారి నినాదాలు చిరుకి స్పష్టంగా వినిపించలేదు. సినిమా అనుకొని 'చేస్తాను' అన్నారు. మళ్లీ సీఎమ్‌ సీఎమ్‌ అంటుండగా చరణ్‌ ఆ విషయాన్ని చిరుకి చెప్పారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ ''నన్ను సినిమా రంగంలో మెగాస్టార్‌ స్థాయికి తీసుకెళ్లారు. ఆ ఆలోచనైతే ఉంది. మీరు గట్టిగా అనుకొంటే ఆ స్థాయికి వెళ్తానేమో? చూద్దాం'' అన్నారు.

    English summary
    This is the generation of youngsters. Let them perform and give their best. It was my exit from films that gave entry for Charan and Bunny to prove. They are developing into real heroes with hectic exercises. If you people wish me to come back, let us see in future. I don’t want to drop the idea,’ said Chiranjeevi
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X