»   » ఇంద్ర సినిమా గుర్తొచ్చింది.. కొత్తగా అనిపించింది.. చిరంజీవి

ఇంద్ర సినిమా గుర్తొచ్చింది.. కొత్తగా అనిపించింది.. చిరంజీవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంద్రసేన టైటిల్ వినగానే నా ఇంద్ర సినిమా గుర్తొచ్చింది. అంతేకాకుండా ఇంద్ర, ఇంద్ర సేనా రెడ్డి అంటూ ఆ సినిమాలో చెప్పే డైలాగ్ గుర్తుకొచ్చిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించి హీరోగా మారిన విజయ్‌ ఆంటోని బిచ్చ‌గాడు, బేతాళుడు వంటి విల‌క్ష‌ణని తెలుగు ప్రేక్షకులకు అందించారు. త్వరలో ఆయన 'ఇంద్రసేన' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. మంగళవారం చిరంజీవి నివాసంలో దీనికి సంబంధించిన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు రాధిక శరత్ కుమార్, ఫాతిమా విజయ్ ఆంటోనీ, హీరో విజయ్‌ ఆంటోని, హీరోయిన్లు డయానా చంపిక, మహిమ కూడా పాల్గొన్నారు.

కథ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది..

కథ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది..

ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ ఈ చిత్ర కథ విన్నప్పుడు చాలా కొత్తగా అనిపించిందని తనకెంతో ఆప్తురాలైన రాధిక ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రం ఘన విజయం పొంది భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

విజయ్ ఆంటోని మల్టీ టాలెంట్

విజయ్ ఆంటోని మల్టీ టాలెంట్

సంగీత దర్శకుడైన విజయ్ ఆంటోని ఇందులో యాక్షన్, ఎమోషన్స్ చక్కగా పండించి ఉంటారని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తూ తాను మల్టీ టాలెంట్ అని నిరూపించుకుంటున్నారని తెలుగు ప్రక్షకులు విభిన్నమైన చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తారని ఆయన అన్నారు.

చిరంజీవిగారికి కృతజ్ఞతలు.. రాధిక

చిరంజీవిగారికి కృతజ్ఞతలు.. రాధిక

చిత్ర నిర్మాత రాధిక మాట్లాడుతూ ... "విజయ్‌ ఆంటోనిగారి సినిమాలకు తెలుగులో క్రేజ్‌ ఉందని ఆయన నటించిన బిచ్చగాడు సినిమా తెలుగులో రికార్డ్‌ కలెక్షన్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేశాయని, ఈ చిత్రం కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.తమ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేసి సపోర్ట్‌ చేసిన మెగాస్టార్‌ చిరంజీవిగారికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చెప్పారు.

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

హీరో: విజయ్‌ ఆంటోని, హీరోయిన్లు: డయానా చంపిక, మహిమ, జ్యువెల్‌ మేరీ, రాధా రవి, కాళి వెంకట్‌, నళిని కాంత్‌, రింధు రవి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. సాహిత్యం: భాషా శ్రీ, కొరియోగ్రఫీ: కల్యాణ్‌, స్టంట్‌: రాజశేఖర్‌, ఆర్ట్‌: ఆనంద్‌ మణి, ఎడిటర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌: విజయ్‌ ఆంటోని, సినిమాటోగ్రఫీ: కె.దిల్‌రాజు, లైన్‌ ప్రొడ్యూసర్‌: శాండ్రా జాన్‌సన్‌, నిర్మాతలు: రాధికా శరత్‌కుమార్‌, ఫాతిమా విజయ్‌ ఆంటోని, దర్శకత్వం: జి.శ్రీనివాసన్‌.

English summary
Indrasena movie first look unveiled by Mega Star Chiranjeevi at his residence. Hero Vijay Antony producer,actor Radhika and many others participated in this event. Senior actor Radhika is one of the producers for Indrasena.Bichagadu fame Vijay Antony is acting as a hero
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu