»   » 13 ఏళ్ల తర్వాత మళ్లీ చిరు-బాలయ్య క్లాష్, గతంలో ఏం జరిగిందంటే?

13 ఏళ్ల తర్వాత మళ్లీ చిరు-బాలయ్య క్లాష్, గతంలో ఏం జరిగిందంటే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందుకు కారణం టాలీవుడ్ టాప్ యాక్టర్లయిన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద క్లాష్ అవుతున్నాయి. ఈ సారి సంక్రాంతి విజయాన్ని ఎవరు సొంతం చేసకుంటారు? అనేది ఆసక్తి కరంగా మారింది.

మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే... దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవి-బాలయ్య సినిమాలు బాక్సాఫీసు వద్ద క్లాష్ అవుతున్నాయి. గతంలో 2004లో చిరంజీవి నటించిన 'అంజి', బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ చిత్రాలు బాక్సాఫీసు వద్ద క్లాష్ అయ్యాయి. అప్పుడు బాలయ్యదే పైచేయి. లక్ష్మి నరసింహ భారీ విజయం సాధించగా, చిరంజీవి అంజి డీలా పడింది.

తాజాగా మళ్లీ 'ఖైదీ నెం 150', 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు బాక్సాఫీసు వద్ద క్లాష్ అవుతున్నాయి. బాలయ్య, చిరంజీవి సినిమాలు బాక్సాఫీసు వద్ద క్లాష్ అవ్వడం టాలీవుడ్ చరిత్రలో ఇది 15వ సారి.

1984లో.... మంగమ్మగారి మనవడు, ఇంటిగుట్టు

1984లో.... మంగమ్మగారి మనవడు, ఇంటిగుట్టు

తొలిసారిగా బాలయ్య, చిరంజీవి నటించిన సినిమాలు 1984లో క్లాష్ అయ్యాయి. అపుడు బాలయ్య నటించిన మంగమ్మగారి మనవడు చిత్రం భారీ విజయం సాధించింది. చిరంజీవి ఇంటి గుట్టు అంతగా ఆడలేదు.

కథానాయకుడు-రుస్తుం

కథానాయకుడు-రుస్తుం

తర్వాత అదే ఏడాది బాలయ్య నటించిన ‘కథానాయకుడు', చిరంజీవి ‘రుస్తుం' చిత్రాలు క్లాష్ అయ్యాయి. అప్పట్లో ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించాయి.

1985లో...

1985లో...

1985లో చిరంజీవి నటించిన ‘చట్టంతో పోరాటం', బాలయ్య నటించిన ‘ఆత్మబలం' చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఇద్దరు స్టార్స్ మధ్య ఇది మూడో క్లాష్.

1986లో....

1986లో....

1986లొ బాలయ్య నటించిన నిప్పులాంటి మనిషి, చిరంజీవి నటించిన కొండవీటి రాజా చిత్రాలు బాక్సాఫీసు వద్ద క్లాష్ అయ్యాయి. కొండవీటి రాజా చిత్రం విజయం అందుకుంది.

అపూర్వ సోదరులు, రాక్షసుడు

అపూర్వ సోదరులు, రాక్షసుడు

1986 సంవత్సరంలోనే బాలయ్య నటించిన అపూర్వ సోదరులు, చిరంజీవి నటించిన రాక్షసుడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఇది ఐదో క్లాష్.

1987లో...

1987లో...

1987 సంవత్సరంలో బాలయ్య నటించిన భార్గవ రాముడు, చిరంజీవి నటించిన దొంగమొగుడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఇది ఆరో క్లాష్.

పసివాడి ప్రాణం

పసివాడి ప్రాణం

1987 సంవత్సరంలోనే బాలయ్య, చిరంజీవి మధ్య మరో క్లాష్ వచ్చింది. బాలయ్య నటించిన రాము, చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం రిలీజ్ అయ్యాయి.

1988లో

1988లో

చిరంజీవి, బాలయ్య మధ్య ఎనిమిదో క్లాష్ 1988లో వచ్చింది. ఈ సారి బాలయ్య నటించిన ఇన్ స్పెక్టర్ ప్రతాప్, చిరంజీవి నటించిన మంచి దొంగ చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

రాముడు-భీముడు

రాముడు-భీముడు

1988లో మరోసారి చిరంజీవి బాలయ్య మధ్య క్లాస్ వచ్చింది. ఈ సారి బాలయ్య నటించిన రాముడు భీముడు, చిరంజీవి నటించిన యుద్ధబూమి చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

1997లో పదోసారి

1997లో పదోసారి

తర్వాత చాలా గ్యాప్ తర్వాత 1997లో మళ్లీ చిరంజీవి, బాలయ్య మధ్య క్లాష్ వచ్చింది. చిరంజీవి నటించిన హిట్లర్, బాలయ్య నటించిన పెద్దన్నయ్య చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

2000 సంవత్సరంలో

2000 సంవత్సరంలో

పదకొండోసారి బాలయ్య, చిరంజీవి మధ్య క్లాష్ 2000 సంవత్సరంలో వచ్చింది. ఈ సారి బాలయ్య నటించిన వంశోద్ధారకుడు, చిరంజీవి నటించిన అన్నయ్య చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

చిరు, బాలయ్య

చిరు, బాలయ్య

2001లో బాలయ్య నటించిన నరిసంహ నాయుడు, చిరంజీవి నటించిన మృగరాజు చిత్రాలు క్లాష్ అయ్యాయి. అదే ఏడాది మళ్లీ బాలయ్య నటించిన భలేవాడివి బాసూ, చిరంజీవి నటించిన శ్రీమంజునాథ చిత్రాలు క్లాష్ అయ్యాయి.

2004లో

2004లో

చివరి సారిగా దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్లీ చిరంజీవి-బాలయ్య సినిమాలు బాక్సాఫీసు వద్ద క్లాష్ అవుతున్నాయి. గతంలో 2004లో చిరంజీవి నటించిన ‘అంజి', బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ చిత్రాలు బాక్సాఫీసు వద్ద క్లాష్ అయ్యాయి. అప్పుడు బాలయ్యదే పైచేయి. లక్ష్మి నరసింహ భారీ విజయం సాధించగా, చిరంజీవి అంజి డీలా పడింది.

English summary
Chiranjeevi vs Balakrishna Movies clash at box office again. Check out details here. Movies of balakrishna and Chiranjeevi which were released with only some days gap means like a battle at same time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu