»   » మెగా ఆశ: రామ్ చరణ్-ఉపాసన అమ్మానాన్న కావాలని!

మెగా ఆశ: రామ్ చరణ్-ఉపాసన అమ్మానాన్న కావాలని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే 60వ వడిలో అడుగు పెట్టారు. షష్ఠి పూర్తి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా నిర్వహించారు. బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల నుండి భారీ సంఖ్యలో సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. మెగాస్టార్ జీవితంలో జరిగిన గ్రాండ్ వేడుకల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.

ఈ వేడుక ఇంత బాగా జరుగడానికి తెర వెనక ఉండి ఏర్పాట్లు చూసుకుంది మరెవరో కాదు... కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాస. రామ్ చరణ్ కంటే ఉపాసనే ఈ కార్యక్రమానికి ఎక్కువ రెస్పాన్సబులిటీ తీసుకుందట. ఈ నేపథ్యంలో చిరంజీవి మాట్లాడుతూ..... ఉపాసన నాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చిది, కానీ నాకు సంతోషం కలిగించే గిఫ్ట్ ఒకటి మాత్రమే ఉంది. ఆ విషయం ఆమెకు కూడా చెప్పాను. అదేమిటో మీరంతా కూడా సులభంగా ఊహించగలరు. నాకో మనవడో, మనవరాలో ఇస్తే చాలా సంతోషిస్తాను' అని చిరంజీవి ఆశ పడుతున్నారు.

Chiranjeevi wants a Grand son/Daughter soon

రామ్ చరణ్, ఉపాసన ప్రేమ వివాహం చేసుకన్న సంగతి తెలిసిందే. చిన్నతనం నుండి స్నేహితులైన చరణ్, ఉపాసన పెధ్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. జూన్ 14, 2012లో వీరి వివాహం జరిగింది. ఇప్పటికి వీరి పెళ్లయి మూడు సంవత్సరాలవుతోంది.

త్వరలోనే ఇద్దరూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందాలను చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. అభిమానులు కూడా రామ్ చరణ్ తండ్రి కావాలని ఆకాంక్షిస్తున్నారు. మరి మెగా కుటుంబ సభ్యులు, అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో ఏమిటో!

English summary
"Upasana giving me so many gifts but i said to her i will be happy only if she gives the ONE gift which every one can easily guess. Yes it's grand son or grand daughter" Said Chiranjeevi where she was just blushing before everyone.
Please Wait while comments are loading...