»   » క్యా సీన్ హై: గోపికల మధ్య కృష్ణుడిలా చిరంజీవి (ఫోటో)

క్యా సీన్ హై: గోపికల మధ్య కృష్ణుడిలా చిరంజీవి (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇక్కడున్న ఫోటో చూస్తే మీకు ఏమనిపిస్తోంది? గోపికల మధ్య కృష్ణుడిలా చిరంజీవి ఉన్నారు కదూ. 80ల్లో తనతో నటించిన హీరోయిన్లతో మెగాస్టార్ చిరంజీవి ఇలా.....గోపికాలోలుడి మాదిరి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. 80 క్లాస్ పార్టీకి సంబంధించిన ఫోటో ఇది.

 Chiranjeevi with his heroines

సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, మళయాల స్టార్ మోహన్ లాల్‌, కన్నడ స్టార్ అంబరీష్‌లతో పాటు హీరోయిన్లు రాధా, రాధిక, నదియా, రమ్యకృష్ణ, సుమలత తదితరులు అంతా ఒక చోట చేరి పార్టీ చేసుకున్నారు. ఈ వయసులో వీళ్లు పార్టీ చేసుకోవడం ఏమిటనేగా మీ డౌట్. అయినా పార్టీ చేసుకోవడానికి వయసుతో పనేముందు లెండి..ఆస్వాదించే మనసుండాలికానీ!

వీరు పార్టీ చేసుకోవడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. వీరంతా 80ల్లో సినీ పరిశ్రమను ఏలిన స్టార్స్. ప్రస్తుతం రాజకీయాలు, సినిమాలు, బిజినెస్ ఇలా వివిధ రంగాల్లో బిజీబిజీగా ఉన్న వీరంతా ఒక్క చోట కలిసి పార్టీ చేసుకోవాలని, పాత జ్ఞాపకాను నెమరు వేసుకోవాలనుకున్నారు. తమిళనాడు ఇంజంబాక్కంలో ఉన్న మోహల్ లాల్‌కు చెందిన బీచ్‌ఫ్రంట్ ఫ్రాపర్టీ ఇందుకు వేదికైంది. ఈ నెల 18వ తేదీన ఈ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఇంకా వెంకటేస్, నరేష్, భాను చందర్, సుహాసిని, సుమన్, జైరాం తదితరులుపాల్గొన్నారు.

English summary
The stars of 80s came together once again. It is fifth year in a row where all the South actors from 80s had a get-together, the annual tradition first started by Suhasini along with Lizy in 2009. This year, Mohanlal threw the party at his beachfront property in Injambakkam, East Coast Road on Saturday (January 18).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu