»   » ఉయ్యాలవాడ లాంచ్ అయిపోయింది: ఎవ్వరూ ఊహించని మెగా పంచ్

ఉయ్యాలవాడ లాంచ్ అయిపోయింది: ఎవ్వరూ ఊహించని మెగా పంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా స్టార్ చిరంజీవి 'ఖైదీనెం 150 తో తన సత్తా చాటుకున్నారు. ఐతే ఆ సినిమా విడుదలై ఏడు నెలలు దాటుతున్నా చిరు తర్వాతి సినిమా మొదలు కాలేదు. చిరు తర్వాతి సినిమాగా'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కన్ఫమ్ అయింది కానీ.. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నది క్లారిటీ లేదు. అనుకుంటూన్న వాళ్ళందరికీ పేద్ద పంచ్ ఇచ్చింది మెగా ఫ్యామిలీ

అభిమానులే నమ్మలేకపోయారు

అభిమానులే నమ్మలేకపోయారు

వేసవికే ప్రారంభోత్సవం అన్నారు కానీ.. అలా జరగలేదు. తర్వాత చిరంజీవి పుట్టిన రోజున కొబ్బరికాయ కొడతారని గట్టి ప్రచారమే జరిగింది. ఇక అంతా ఆరోజు కోసమే ఎదురు చూస్తున్నార్తు. అయితే ఉన్నట్టుండీ ఈ రోజు ఉదయం చడీచప్పుడు లేకుండా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ముహూర్త కార్యక్రమం పూర్తి చేసేసింది చిత్ర బృందం. అసలూ ఈ విషయం తెలియగానే అభిమానులే నమ్మలేకపోయారు.

Nayanthara in Chiranjeevi's film
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

కొణిదెల ప్రొడక్షన్స్ ఆఫీస్ లో బుధవారం ఉదయం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ప్రారంభోత్సవం చడీచప్పుడు లేకుండా చాలా సింపుల్ గా పూర్తి చేశాడట రామ్ చరణ్. చిరంజీవి.. చరణ్.. సురేందర్ రెడ్డిలతో పాటు అ్లలు అరవింద్.. సురేఖ. పరుచూరి సోదరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

షూటింగ్ ఎప్పుడన్నది ప్రకటించలేదు

షూటింగ్ ఎప్పుడన్నది ప్రకటించలేదు

రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడన్నది ఇంకా ప్రకటించలేదు. మామూలుగా ముహూర్త కార్యక్రమంలో స్క్రిప్టు చేతికిచ్చేటపుడు ఒక ఫైల్ కనిపిస్తుంది. కానీ ‘ఉయ్యాలవాడ..' ప్రారంభోత్సవం సందర్భంగా మూడు పెద్ద ఫైల్స్ కనిపించడం విశేషం. దీన్ని బట్టి ఇది పెద్ద సినిమా కావచ్చని.. డైలాగులు భారీ స్థాయిలో ఉండొచ్చని భావిస్తున్నారు.

సాయిమాధవ్ బుర్రా

సాయిమాధవ్ బుర్రా

పరుచూరి సోదరులతో పాటు సాయిమాధవ్ బుర్రా.. వేమారెడ్డి.. ఇంకో ఇద్దరు రచయితలు కలిపి వండిన స్క్రిప్టు ఇది. ఈ చిత్రానికి సంగీతాన్నందించేందుకు ఎ.ఆర్.రెహమాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ.. తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరున్న టెక్నీషియన్లనే తీసుకుంటున్నారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా రవి వర్మన్ ను ఎంచుకున్న సంగతి తెలిసిందే.

English summary
Megastar Chirnajeevi Uyyalawada Narasimhareddy Biopic Launched to Day morning
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu