»   »  చిరుకు ఊహించని సపోర్ట్!?!?!

చిరుకు ఊహించని సపోర్ట్!?!?!

Posted By:
Subscribe to Filmibeat Telugu


విజయవాడ వాసులు ఏం చేసినా సంచలన రీతిలోనే చేస్తారు. అది మంచైనా చెడైనా సంచలనరీతిలోనే ఉంటుంది. ఇపుడు చిరంజీవి పార్టీ పెడతారంటే ముందుగా ఫ్యాన్స్ తో బహిరంగ సభను నిర్వహించడానికి విజయవాడ చిరు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. మరికొంత మంది అభిమానులు గురువారంనాడే పూలు పంచుతూ చిరు గాంధీగిరిని ప్రదర్శించారు.

విచిత్రంగా విజయవాడకు చెందిన రెబల్ స్టార్ కృష్ణంరాజు అభిమానులు కూడా చిరంజీవి పార్టీ పెట్టాలని కోరుకుంటున్నారు. చిరునవ్వుల చిరంజీవి, సర్వజన హృదయుడు చిరంజీవి రాజకీయ పార్టీ పెట్టి చరిత్ర సృష్టించాలని వారు బహింరంగంగా ప్రకటనలు చేస్తున్నారు. చిరంజీవి పార్టీ పెట్టాలని చిరు అభిమానులు కోరుకోవడం పెద్ద విషయం కాదు కానీ మరో హీరో అభిమానులు కోరుకోవడమే ఇక్కడ విశేషం. రెబల్ స్టార్ అభిమానుల ఉత్సాహం చూస్తుంటే రెబల్ స్టార్ ను బిజెపి నుంచి చిరు పార్టీలోకి లాక్కొచ్చేలా ఉంది. అందుకే విజయవాడ వాసులు ఏం చేసినా సంచలనమే అన్నది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X