»   » తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు : తిరుమల లోనే ఈ కలయిక వెనక కారణమేంటి??

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు : తిరుమల లోనే ఈ కలయిక వెనక కారణమేంటి??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకే సారి దిగ్గజాలంతా కలిసి తిరుపతిలో తాము వేంకటేశ్వరుడి దర్శణం చేసుకొని, అందరూ కలిసి అక్కడివారికీ దర్శనం ఇచ్చారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్, మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు..

టాలీవుడ్ టాప్ స్టార్స్ నాగార్జున, చిరంజీవిలు మంగళ వారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం చేరుకోగా, వీరితో పాటు నిమ్మగడ్డ ప్రసాద్, అల్లు అరవింద్ ఉన్నారు. సచిన్ తన భార్యతో కలిసి సపరేట్ కారులో ముందుగా తిరుమలకు వెళ్ళగా ఆ తర్వాత చిరు, నాగ్ తదితరులు మరో వాహనంలో తిరుమలకు చేరుకున్నారు.

అయితే ఇందరు ప్రముఖులు ఒకచోట కలవటం అంటే ఏదో విశేషం ఉండే ఉంటుందికదా... అదేమిటంటే కేరళలో ఫుట్ బాల్ అకాడమీని నెలకొల్పాలని వీరు ముగ్గురు భావిస్తున్నారు. ఇందుకోసం కేరళ ముఖ్యమంత్రి పినరాయివిజయన్ అపాయింటుమెంట్ కూడా తీసుకున్నారు.

తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకోగానే చెన్నై మీదుగా తిరువనంతపురం చేరుకున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌తో అకాడెమీ ఏర్పాటు విశయమై చర్చించారట. వారు నెలకొల్పే అకాడమీకి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ముఖ్యమంత్రి విజయన్ హామీ ఇచ్చారట కూడా...

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

అందరూకలిసి సర్ప్రైజ్ ఇచ్చారు: క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్, మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జున, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ లని ఒకే సారి చూసిన తిరుమలలో భక్తులూ/అభిమానులూ చాలా సర్ప్రైజ్ అయ్యారు.

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

కలవటం కాకతాళీయం కాదు: ఈ నలుగురు ప్రముకులూ ఒకేసారి రావటం యాదృచ్చికం ఏమీ కాదు. కేరళలో తాము స్థాపించాలనుకునే ఫుట్బాల్ అకాడమీ కోసం కేరళ వెళ్ళేముందు ఇలా తిరుమలలో కలుసుకోవటం వారి ప్లాన్ లో భాగమే.

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

సతీసమేతంగా క్రికెట్ దేవుడు: తన భార్య అంజలితో కలిసి వచ్చిన సచిన్ ఎయిర్ పోర్ట్నుంచి నేరుగా తిరుమలకు వెళ్ళిపోయి చిరు,నాగ్ ల కోసం వైట్ చేసాడు.

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

ఇద్దరూ ఇద్దరే: ఆ వెంటనే తెలుగు స్టార్ లిద్దరూ కలిసే తిరుమలకి బయలుదేరారు. రాబోయే సినిమా నమోవెంకటేశాయ కోసం గడ్డం పెంచిన నాగ్, కత్తిలాంటోడుకోసం మీసం పెంచిన చిరూ ఇద్దరూ డిఫరెంట్ లుక్ లో కనిపించారు.

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

పట్టుబట్టల్లో ప్రముఖులు: దర్శనం కోసం మాత్రం అంతా కలిసే వెళ్ళారు.

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

దర్శనం: స్వామివారిని వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకున్నారు. ఈ భక్తి గెటప్ లో నాగార్జున తన కొత్త సినిమా పాత్రలో లీనమైనట్టే కనిపించారు.

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

తిరుమలేశున్ని సేవించుకున్న ప్రముఖులు

కేరళ కి చేరిన బృందం: తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకోగానే చెన్నై మీదుగా తిరువనంతపురం చేరుకున్నారు.

English summary
Megastar Chiranjeevi, Nagarjuna, cricket legend Sachin Tendulkar, entrepreneur Nimmagadda Prasad and producer Allu Aravind on Tuesday night landed in Tirupathi. They were in Tirupathi to have special darshanam of Lord Venkateshwara.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu