»   » చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి నిహారిక షోకు...

చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి నిహారిక షోకు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుండి తొలిసారి నిహారిక హీరోయిన్ గా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన 'ఒక మనసు' చిత్రం రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈరోజు రాత్రి ప్రత్యేకంగా మెగా ఫ్యామిలీ సభ్యులందరికీ ఒక స్పెషల్ షో వేస్తున్నారు.

Also Read: మెగా అనే పదం చాలా ప్రెస్టిజియస్, పెద్దనాన్న కష్టార్జితం (నిహారిక ఇంటర్వ్యూ)


ఈ రోజే 150వ సినిమా తొలి రోజు షూటింగులో పాల్గొన్న చిరంజీవి......ఈ రోజు రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి నిహారిక నటించిన 'ఒక మనసు' ప్రీమియర్ షో చూస్తున్నారని తెలుస్తోంది. ఆయనతోపాటు పవన్ కళ్యాన్ కూడా సినిమా ప్రీమియర్ చూసే అవకాశం ఉందని అంటున్నారు.


Also Read: ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లు రాయరెందుకో? నిహారిక గురించి అడిగితే నాగశౌర్య రియాక్షన్!


తన ఫ్యామిలీ మెంబర్స్ నుండి తన తొలి సినిమాకు ఎలాంటి పీడ్ బ్యాక్ వస్తుందో అని నిహారిక ఉత్కంఠగా ఎదురు చూస్తోందని...వీరి నుండి మంచి ఫీడ్ బ్యాక్ వస్తే మెగా అభిమానులకు కూడా సినిమా నచ్చుతుందని నిహారిక నమ్మకంతో ఉందట.


Chiru, Pawan to watch Oka Manasu premiere

సినిమా గురించిన వివరాల్లోకి వెళితే...
మెగా డాటర్ నిహారిక, నాగ శౌర్య జంటగా... TV 9 సమర్పణలో, మధుర ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం జూన్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది.


'ఒక మనసు' సినిమా రిజల్టు మీదనే నిహారిక సినీ భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చి, నిహారికకు మంచి పేరు వస్తేనే ఆమె సినిమాల్లో కొనసాగే అవకాశం ఉంది. ఏదైనా తేడా వస్తే నిహారిక మళ్లీ తెరపై కనపించే అవకాశం లేదని అంటున్నారు.

English summary
Chiranjeevi, Pawan Kalyan to watch Niharika's Oka Manasu movie premier today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu