»   » 'బాహుబలి' ని పొగడ్తల్లో ముంచెత్తిన చిరంజీవి(వీడియో)

'బాహుబలి' ని పొగడ్తల్లో ముంచెత్తిన చిరంజీవి(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టి.సుబ్బరామిరెడ్డి అందిస్తున్న జాతీయ సినీ పురస్కారాల వేడుక ఆదివారం శిల్పకళావేదికలో అంగరంగ వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు.సినీతారల వెలుగులు మిరుమిట్లు గొలిపాయి. నృత్యాల హోరులో ప్రేక్షకులు తడిసి ముద్దయ్యారు. ఈ సందర్బంగా చిరంజీవి మాట్లాడుతూ బాహుబలి చిత్రాన్ని పొగడ్తల్లో ముంచెత్తారు. ఆయనేం అన్నారో ఇక్కడ చూడండి.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజా అద్భుత సృష్టి బాహుబలి.తెలుగు,తమిళ భాషలలో రూపొందించిన అత్యంత భారీ చిత్రం ఇది . ప్రభాస్,రానా,అనుష్క,తమన్న,రమ్యక్రిష్ణ,సత్యరాజ్,నాజర్ తదితరులు ప్రదాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.


సినిమా చూసిన వారందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో తీశాడంటూ ప్రశంసిస్తున్నారు. పాత్రలు వేటికవే సాటిగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యపాత్రధారులు విశ్వరూపం చూపించారని మెచ్చుకున్నారు. ముఖ్యంగా రమ్యకృష్ణ గొప్పగా నటించారని చెబుతున్నారు. అవంతికగా తమన్నా ఒదిగిపోయిందని అంటున్నారు.


హీరో ప్రభాస్, విలన్ దగ్గుబాటి రానా పోటీపడీ నటించారని తెలిపారు. క్లైమాక్స్ లో 45 నిమిషాలు సాగిన యుద్ధసన్నివేశాలు హైలెట్ గా నిలిచాయని తెలిపారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ రేంజ్ లో ఉన్నాయన్నారు. ఇక సినిమా ప్రముఖులు కూడా మాస్టర్ పీస్ అంటూ పొగుడుతున్నారు. ప్రస్తుతం వస్తున్న స్పందనను బట్టి చూస్తే 'బాహుబలి' భారీ హిట్ అయ్యే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Chiru praises Baahubali @ TSR National Film Awards

ఒక్క హైదరాబాద్ లోనే సినిమా లిస్టింగ్స్ చూస్తే.. బాహుబలి కాకుండా మిగిలినవి మూడు నాలుగు సినిమాలే. అవి కూడా ఉన్నది రెండు మూడు థియేటర్లలోనే. ఈ రేంజిలో విడుదల చేసిన బాహుబలి... ఇండస్ట్రీ అంచనాలకు తగినట్లుగానే వసూళ్లు చేసింది.


ఒక్క మొదటి రోజే తెలుగు వెర్షన్ ఒక్కటే 30.7 కోట్లు వసూలు చేసింది. టాలీవుడ్ ఓపెనింగ్స్ లో ఇప్పటివరకు ఏ సినిమా సాధించనంత స్థాయిలో తొలిరోజు కలెక్షన్లు రావడంతో.. ఇక తమిళ, హిందీ వెర్షన్లు కూడా కలిపితే ఇది 60 కోట్లు దాటింది.


అమెరికాలో తెలుగు వెర్షన్ కు మూడు రోజులు కలిపి 34,56,605 డాలర్లు.. అంటే, 21.91 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు ఏ భారతీయ సినిమాకు అమెరికాలో ఇంత వసూళ్లు రాలేదు. ఆగండి.. అప్పుడే అయిపోలేదు. అక్కడ తమిళ వెర్షన్ కూడా రిలీజైంది. దానికి కూడా మొదటి మూడు రోజుల్లో 98.82 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. అంటే రెండూ కలిపితే దాదాపు రూ. 23 కోట్లన్న మాట.

English summary
Chiranjeevi praises Baahubali at TSR Tv9 National Film Awards.
Please Wait while comments are loading...