»   » మీడియాకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్, ఎందుకంటే

మీడియాకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్, ఎందుకంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చరణ్ దిగి వచ్చి మీడియాకు క్షమాపణ చెప్తూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. అయితే మీడియాకు ఆయన క్షమాపణ చెప్పాల్సిన సిట్యువేషన్ ఏమొచ్చింది, ఎప్పుడొచ్చింది అంటారా. రీసెంట్ గా చిరు 61 పుట్టిన రోజు వేడుకలో మీడియాకు అవమానం జరిగిట్లైంది. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ మీడియాని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.

Chiru's 61st birthday: Ram Charan's Apology to Media

రీసెంట్ గా చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు పార్ట్ హయిత్ లో ఘనంగా జరిగాయి. అయితే మీడియాను లోపలకి రానివ్వకుండా రిస్ట్రిక్ట్ చేసారు. అయితే నిజానికి శిల్పకళా వేదిక వద్దనూ, మెగా ఫ్యామిలీ చేసిన ఈవెంట్స్ కు హాజరైన మీడియాను పార్క్ హయిత్ కు వచ్చి కవర్ చేసుకోమని చెప్పారు. అయితే వెన్యూ వద్దకు వెళ్లాక రెడ్ కార్పెట్ దాకానే మీడియాను లోపలకి రానిచ్చారు. దాంతో మీడియా వర్గాలు చాలా అప్ సెట్ అయ్యాయి.

మీడియాకు సరైన ట్రీట్ మెంట్ జరగలదేని న్యూస్ ద్వారా తెలుసుకున్న రామ్ చరణ్ క్షమాపణ చెప్తూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఆయన ఈ విషయాన్ని ఓ దురదృష్టకర సంఘటన గా భావిస్తున్నామని, భవిష్యత్ లో అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ , డిజిటల్ మీడియా వారందరికీ ఆయన ధాంక్స్ చెప్పారు.

English summary
After reading about the news of mistreatment to media, Charan has released a pressnote to seek an apology.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X