»   » మళ్ళీ ఆగనున్న చిరు 150.... కారణం మీరు ఊహించేదే

మళ్ళీ ఆగనున్న చిరు 150.... కారణం మీరు ఊహించేదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

తొమ్మిదెళ్ళ గ్యాప్ ప్రభావమో, లేక సినిమా ఏ క్షణాన అనుకున్నారో గానీ మెగా స్టార్ సినిమాకి అడుగడుగునా అవాంతరాలే వస్తున్నాయి. లేక లేక ఇన్నేళ్లకు సినిమా మొదలైతే దానికి ఒకటి వెనుక ఒకటి గా అన్నీ సమస్యలే. కొన్నాళ్ళు చిరు బరువు, ఇంకొన్నాళ్ళు సినిమా కథ నాదే అంటూ రచయిత కేసు.... ఇలా మొదలయ్యిందీ అనుకున్న ప్రతీసారీ షూటింగ్ వాయిదా పడుతూనే ఉంది.

అన్నిటికంటే ముఖ్యమైన హీరోయిన్ ఇప్పటికీ దొరకలేదు. సినిమా షూటింగ్ మొదలయ్యేటపుడు తొలి షెడ్యూల్ వరకు హీరోయిన్ లేకుండానే కానిచ్చేద్దాం.. ఈ లోపు హీరోయిన్ని ఫైనలైజ్ చేసేద్దాం.. రెండో షెడ్యూల్లో హీరోయిన్ కాంబినేషన్లో సన్నివేశాలు తీద్దాం అనుకుని రంగంలోకి దిగింది "కత్తిలాంటోడు" టీమ్. అయితే ఇన్ని రోజుల గ్యాప్ తో స్క్రిప్ట్ పై బాగా వర్క్ చేసి, పక్కా క్లారిటీతో రంగంలోకి దిగిన వినాయక్.. ఏమాతరం తడబాటు లేకుండా శరవేగంగా తొలి షెడ్యూల్ పూర్తి చేసేశాడు. సినిమాలో చిరు ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్.., చిరు-ఆలీ కాంబినేషన్లో కామెడీ పార్త్ పూర్తిచేసేసారు.

ఐతే ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం చేసుకున్న ప్రకారం రెండో షెడ్యూల్ మొదలుపెట్టాలంటే.. హీరోయిన్ కావాలి. కానీ ఇప్పటిదాకా ఆ సంగతి తేలలేదు.దాదాపు ఆరు నెలలకు పైగానే వెతుకుతున్నా ఇప్పటికీ చిరు కి సరిపోయే అమ్మాయి దొరకలేదు. సౌత్‌లో నయనతార, అనుష్క లాంటి వాళ్లను అనుకున్నా వాళ్ళు కుదర లేదు...

chiranjeevi

కుర్ర భామలేమో చిరు పక్కన సూటవ్వరు.. ఏలా? అనుకుని బాలీవుడ్ లోనూ నాన్నకోసం పిల్లని వెతిక్కాడు నిర్మాత రామ్ చరణ్. అందులోనూ బాలీవుడ్ హీరోయిన్ అయితే సినిమాకు నార్త్ లో మార్కెట్ కూడా పెరుగుతుందని భావించాడు. కానీ ఎవ్వరూ ఇప్పటిదాకా ఫైనలైజ్ అవ్వలేదు. దీపికా పదుకునే.., జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నర్గిస్ ఫక్రీ ఎవ్వరూ ఫైనలైజ్ కాలేదు. నర్గిస్ చివరి వరకూ వచ్చినా 5 కోట్ల రెమ్యున రేషన్ అడ్qఅగటం తిఓ బెంబేలు పడ్డ రాం చరణ్ బాలీవుడ్ ని భరించటం కష్టమే అనుకున్నట్టున్నాడు. రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు సమస్య ముందుకొచ్చి కూచుంది.

ఇప్పుడు కత్తిలాంటోడు టీం ముందు రెండు మార్గాలున్నాయి. ఒకటి ఇప్పటికిప్పుడు హీరోయిన్ ని వెతికి తెచ్చుకోవటం, ఇది కష్టమే కాబట్టి ముందు అనుకున్న షెడ్యూల్ ని మళ్ళీ మార్చుకొని హీరోయిన్ లేని మిగతా పార్ట్ లని షూట్ చేసుకోవటం. ఈ రెండూ కాకుండా ఉన్న మూడో మార్గం మళ్ళీ షూటింగ్ ఆపేసి హీరోయిన్ దొరికేదాకా రెస్ట్ తీసుకోవటం.... మరీమూడిట్లో ఏది ఎంచుకుంటాడో రామ్ చరణ్ చూడాలి...

English summary
Chiranjeevi's new Movi Kattilantodu is completed its first schedule and ready to move for next but no heroine in sight so shoot might be postponed...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu