»   » ఒక్క పొరపాటు.... అమెరికాలో ఖైదీ బయ్యర్లకు కోట్ల లో నష్టాలు తప్పవా

ఒక్క పొరపాటు.... అమెరికాలో ఖైదీ బయ్యర్లకు కోట్ల లో నష్టాలు తప్పవా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందీ అంటే ఇదేనేమో అమెరికాలోని ఒక టెలీకమ్యూనికేషన్ సంస్థ చేసిన తప్పుకు ఇప్పుడు అక్కడ ఖైదీ ని కొన్న బయ్యర్లకు కష్టాలు తెచ్చిపెట్టేలా ఉంది. టెలికాం ఆపరేటర్ సంస్థ చేసిన ఒకే ఒక్క పొరపాటు కు కోట్లలో పరిహారం చెల్లించాల్సి వచ్చేలాఉంది.

అమెరికాలో 4జీ సేవలందించే సుప్రసిద్ధ జర్మన్‌ టెలీకమ్యూనికేషన్స్‌ కంపెనీకి.. 'ఖైదీ నంబర్‌ 150' దెబ్బ తగిలింది. ఆ కంపెనీకి.. చిరంజీవి సినిమాకీ సంబంధమేంటంటారా? ఆ సంస్థ తమ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో భాగంగా 'టి-మొబైల్‌ ట్యూస్‌డేస్‌' పేరిట ఆఫర్‌ ప్రకటించింది. దాంట్లో భాగంగా.. టి-మొబైల్‌ వినియోగదారులు తమ ఫోన్‌ నంబర్‌తో లాగిన్‌ అయ్యి మంగళవారం నాడు 2 డాలర్లకు సినిమా టికెట్లు కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.


Chiru's Khaidi No 150 surgical strike on T Mobile

సంక్రాంతి ఆఫరేదో బాగుందనుకున్న సమయంలో మెగాస్టార్ సినిమా టికెట్ ఇండియాలోకంటే చవక అనగానే మనోళ్ళు ఎగబడి మరీ కొనేసారు... మొదటిరోజునే మిలియండాలర్ల టార్గెట్ చేరుకోవాలనుకున్నది ఖైదీ టార్గెట్ అందుకే అక్కడ టికెట్ రేటు 25 డాలర్లుగా నిర్ణయించారు... అంత అంటే కష్టమే కాబట్టి మనవాళ్ళు వెనకా ముందూ ఆలోచిస్తున్న సమయంలో టీ మొబైల్ అనే టెలీకాం ఆపరేటర్ సంస్థ ఏకంగా ఒక్కోటికెట్ 2 డాలర్లకే అమ్ముతాం అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది ఏకంగా 98% తగ్గిపంపు అనగానే మన ఎన్నారైలు విపరీతంగా కొనేసారు


సాధారణంగా అమెరికాలో సినిమా టికెట్ల వెల 9.15 డాలర్లుగా ఉంటుంది. 2 డాలర్లు పెట్టి ప్రేక్షకులు టికెట్లు కొనగా.. మిగతా మొత్తాన్ని టి-మొబైల్‌ సంస్థ డిసి్ట్రబ్యూటర్లకు చెల్లిస్తుంది. తద్వారా ఆ సంస్థకు ప్రచారం లభిస్తుంది. వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం అమెరికాలో రిలీజైన 'ఖైదీ నంబర్‌ 150' సినిమా టికెట్లను చిరు ఫ్యాన్స్‌ ఇబ్బడిముబ్బడిగా కొన్నారు.


అమ్ముడైన టికెట్లలో 31,837 టికెట్లు.. అంటే దాదాపుగా 35 శాతం టికెట్లు టి-మొబైల్‌ ట్యూస్‌డే ఆఫర్‌లో అమ్ముడయ్యాయి. కానీ.. టికెట్‌ వెల మామూలు సినిమాల్లాగా 9.15 డాలర్లు కాదు. మనదేశంలోలా భారీగా పెంచేసి 25 డాలర్లుగా పెట్టారు. లెక్కప్రకారమైతే ఆఫర్‌లో భాగంగా ఈ 31,837 టికెట్లకూ టి-మొబైల్‌ సంస్థ ప్రేక్షకులు ఇచ్చే 2 డాలర్లు పోగా ఒక్కో టికెట్‌కూ 23 డాలర్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా రూ.5 కోట్లకు సమానం. 31 వేలకు పైగా టికెట్లు అమ్ముడు కావడం, టికెట్‌ వెల 25 డాలర్లు కావడంతో ఆ సంస్థ అప్రమత్తమై అంతర్గత దర్యాప్తు చేస్తోంది.


ఒకవేళ ఆ సంస్థ గనక పెంచిన ధరతో తమక సంబంధం లేదని.. ఎప్పటిలాగానే ఒక్కో టికెట్‌కూ 7.15 డాలర్లు మాత్రమే చెల్లిస్తామంటే.. భారీ మొత్తాలు చెల్లించి అమెరికాలో ఈ సినిమా హక్కులు తీసుకున్నవారి పరిస్థితి గల్లంతేనని చిత్రపరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి!! అప్పుడు అసలు దెబ్బ 'టి-మొబైల్‌'కు కాక.. హక్కులు తీసుకున్నవారికి పడుతుందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

English summary
TMobile, the America’s fastest 4G LTE Network in collaboration with Fandango – the online Movie tickets portal , has offered the Khaidi No 150 premier show ticket worth $25 for just $2. This offer has turned out to be a Mega surgical attack on T-Mobile . It has to bare around $400k for its TMobileTuesdays offer. After TMobileTuesdays offer for Khaidi No 150, The company will either be removed or company will file for bankruptcy
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu