»   » చిరంజీవి మేనల్లుడు ఎంట్రీ చిత్రం కథ ఇదా?

చిరంజీవి మేనల్లుడు ఎంట్రీ చిత్రం కథ ఇదా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
చిరంజీవి మేనల్లుడు ధరమ్ తేజ ని హీరోగా పరిచయం చేస్తూ వైవియస్ చౌదరి ఓ చిత్రం ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం టైటిల్ రేయ్ ..అలాగే చిత్రం ఈ నెల 17 వ తేదీనుండి ప్రారంభం కానుంది. వైవియస్ చౌదరి సినిమా ఇన్విటేషన్ ని గురువారం విడుదల చేసారు. ఈ కార్యక్రమం ఫిల్మ్ క్లబ్ లో జరిగింది. ఈ సందర్భంగా వైవియస్ చౌదరి కథ గురించి మాట్లాడుతూ...అరేబియన్ దీవుల్లో స్ధిరపడ్డ కొంతమంది భారతీయ సంతతి కి చెందిన యువకులు..హీరోతో జట్టుగా చేరి రేయ్ అనే బ్యాండుని స్ధాపించి ..అమెరికా వెళ్ళతారు.వారి స్లోగన్..గెలుపు కోసం అరుపు. ఇక వారు తమ సంగీతంతో ఎలా విజయం సాధించి సెటిలయ్యారన్నది మిగతా కథ. ఇది పూర్తిగా మ్యూజికల్ ఎంటర్టైనర్ అన్నారు చౌదరి. ఇక ఈ చిత్రం సగం వెస్టీడీస్ లోనూ మిగతా సగం అమెరికాలనూ షూటింగ్ జరగనుంది అన్నారు . అలాగే ఈ సినిమా స్క్రిప్టుపై ఎనిమిది నెలలపాటు కష్టపడ్డామని స్క్ర్పిటు కన్సల్టెంట్ రాజ సింహ తెలిపారు. ఇక బొమ్మరిల్లు బ్యానర్ పై ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి షౌట్ ఫర్ సక్సెస్ అనే ట్యాగ్ లైన్ ని పెట్టారు.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu