»   » సినిమా రచన, కథా నిర్మాణంపై వర్క్ షాప్

సినిమా రచన, కథా నిర్మాణంపై వర్క్ షాప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమా కథలు, స్క్రీన్ ప్లే గురించి పది రోజుల వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు స్క్రీన్ క్రాప్ట్ సంస్ధ ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రియల్ ఐదవ తేదీన ప్రారంభమయ్యే ఈ వర్క్ షాప్ లో రచన, దర్శకత్వ రంగాలలో రాణించాలనుకునే ఔత్సాహికులకు ఉపయోగపడేలా వివిధ కథన రీతులనూ, మెలకువలనూ స్క్రీన్ క్రాప్ట్ సంస్ధ డైరక్టర్ విబి చౌదరి వివరిస్తారు. విబి చౌదరి ఓ ప్రముఖ నిర్మాణ సంస్ధలో స్క్రిప్ట్ కన్సలటెంట్ గా పనిచేస్తున్నారు. అలాగే కొన్ని చిత్రాలకు ఆయన పనిచేస్తున్నారు. ఇక ఈ క్లాసులలో సిడ్ ఫీల్డ్ స్ట్రక్చర్, హీరోస్ జర్నీ, సీక్వెన్స్ మెధడ్ వంటి అధునాతన కథా నిర్మాణ విధానాలనూ, క్లాసికల్, ఫ్లాష్ బ్యాక్ వంటి కథన రీతులనూ చర్చిస్తారు. వర్క్ షాప్ ప్రతి రోజూ సాయింత్రం రెండు గంటలు పాటు జరుగుతుంది. ఆసక్తి గలవారు పూర్తి వివరాలు కోసం 964 228 6216 నంబరు పై సంప్రదించగలరు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X