For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాజల్ డార్లింగ్... ఎన్టీఆర్ తర్వాత ఈ హీరోనే.. తమన్ దుర్మార్గుడంటున్న ఛోటా కె నాయుడు!

  |
  Kavacham Movie Audio Launch Highlights

  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ' కవచం '. శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 7న విడుదలవుతున్న నేపథ్యంలో భీమవరంలో ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించారు.

  ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ ఛోటా కె నాయుడు తన స్పీచ్‌తో అదరగొట్టారు. హీరోయిన్, హీరో, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడి గురించి సుత్తి కొట్టకుండా సింపుల్‌గా వారిలోని గొప్పతనం గురించి వివరించారు.

  కాజల్ డార్లింగ్...

  కాజల్ డార్లింగ్...

  కాజల్ డార్లింగ్ గురించి ఓ విషయం చెబుతాను. మనం చిన్నప్పుడు ఇసుక తుఫాను గురించి చిన్నప్పుడు చదువుకున్నాం. అలాంటి ఇసుక తుఫానులో షూటింగ్ చేస్తుంటే రెడీ అని చెప్పగానే వచ్చి షాట్‌లో 40 నిమిషాలు ఒక గొడుకు పట్టుకుని కూర్చుంది. నేను వెళతాను, కారులో కూర్చుంటాను అని చెప్పకుండా అలాగే కూర్చుని షాట్ యాక్ట్ చేసి వెళ్లిపోయింది. ఇన్ని సంవత్సరాలు హీరోయిన్‌గా తన కెరీర్ ఎంత టాప్ లో ఉన్నా... ఆమె డెడికేషన్ వల్లే ఈ పొజిషన్లో ఉంది. హాట్సాఫ్ కాజల్ డార్లింగ్, లవ్ యూ నాన్న... కీప్ ఇట్ అప్.

  ఎన్టీఆర్ తర్వాత ఇతడిలోనే చూశా

  ఎన్టీఆర్ తర్వాత ఇతడిలోనే చూశా

  ఎన్టీఆర్ తర్వాత సాయి శ్రీనివాస్‌లోనే ఇలాంటిది చూశాను. ఒక్క మూమెంట్ ఇస్తే టేక్ 1 ఓకే చేస్తాడు. లెంతీ డైలాగ్ ఇస్తే ఒక్కసారే చూస్తాడు. ఇప్పటి వరకు సాయి పెర్ఫార్మెన్స్ గురించి కానీ డాన్స్ మూమెంట్లో వన్ మోర్ మూమెంట్ కానీ ఎప్పుడూ అడగలేదు. తనే వచ్చి నేను ఒకసారి వన్ మోర్ చేస్తాను. నాకు చేయాలని ఉంది అని అడిగే హీరో. ఎండ, వాన, చలి డోంట్ కేర్... నైట్ 2 గంటల వరకు షూటింగ్ చేసినా ఉదయాన్నే రమ్మంటే వస్తాడు. కవచం తర్వాత అతడి రేంజి పెరుగుతుంది.

  థమన్ దుర్మార్గుడు

  థమన్ దుర్మార్గుడు

  తమన్ గరించి ఎక్కువ చెప్పాను.. 100వ సినిమాలు చేసిన దుర్మార్గుడు. తమన్‌కు నాకు ఎప్పటి నుండో పోటీ. అతడి పాటలు, నా విజువల్స్‌కు పోటీ. ఇందులోని సాంగ్స్ విషయంలో థమనే డామినేట్ చేశాడేమో అని, విజువల్‌గా అతడి రేంజిని అందుకోలేక పోయానేమో? అని చిన్న డౌట్. 7న సినిమా వస్తోంది. బావుంటే మెచ్చుంకోండి, బాగోలేకుంటే తిట్టండి.

  వాల్లది అసలు పిడుగురాళ్ల

  వాల్లది అసలు పిడుగురాళ్ల

  నిర్మాతలు మామూలుగా ఖర్చు ఎక్కువ అవుతుంటే ఇంతలో చాలు అంటారు. కానీ నాని అలా కాదు. ఖర్చుకు వెనకాడొద్దు. మాది పిడుగురాళ్ల మా ఊరి రేంజిలో నా పేరు నిలబడాలి అని చెప్పిన వ్యక్తి. ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌గా ఛాన్స్ ఇచ్చినపుడు వాళ్లు ఎంత వీలైంతే అంత చేసేద్దామనుకుంటారు. కానీ శ్రీనివాస్ మామిళ్ల... వివి వినాయక్ లాగా చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్.

  కవచం

  కవచం

  ఈ చిత్రంలో మెహ్రీన్ పిర్జాదా, బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  English summary
  Cinematographer Chota K Naidu Superb Words About Kajal at Kavacham Audio Launch. The movie Starring Bellamkonda Sai Sreenivas, Kajal Aggarwal, Mehreen Pirzada. Music Composed by #ThamanS, Produced by Navven Chowdary Sontineni (nani) and Directed by #SreenivasMamilla, Under the Banner of Vamsadhara Creations.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X