twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    CM KCR: కృష్ణ గొప్ప మిత్రుడు.. ఆ మాట చెబితే నవ్వారు.. ఫన్నీ మెమోరీస్ చెప్పిన సీఎం కేసీఆర్

    |

    తెలుగు సినిమా నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేక అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నానక్ రామ్ గూడలోని ఆయన నివాసంలో ఉన్న ఆయన పార్థీవ దేహానికి సినీ లోకమంతా తరలివచ్చింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు రాజకీయాల్లో కీలక నేతలు సైతం కృష్ణ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.

    గుండెపోటుతోపాటు..

    గుండెపోటుతోపాటు..

    సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ లోకానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన కన్నుమూయడంతో నివాళిగా చిత్ర పరిశ్రమలోని అన్నీ కార్యకలపాలను రేపు ఒక్కరోజు నిలిపివేసి సెలవు ప్రకటించారు. సూపర్ స్టార్ కృష్ణ గుండెపోటుతో ఆదివారం రాత్రి హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ చేరిన విషయం తెలిసిందే. కార్డియాక్ అరెస్ట్ తో పాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

    రేపు పద్మాలయ స్టూడియోకు పార్థీవదేహం..

    రేపు పద్మాలయ స్టూడియోకు పార్థీవదేహం..

    కృష్ణ గారి పార్థీవ దేహాన్ని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్ రామ్‌ గూడలోని ఆయన నివాసానికి తరలించారు. మంగళవారం రాత్రి వరకు ఆయన పార్థీవ దేహాన్ని అక్కడే సినీ ప్రముఖుల సందర్శనార్థం కోసం ఉంచనున్నారు. అనంతరం రేపు ఉదయం 8 గంటలకు పద్మాలయ స్టూడియోకు అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని తరలించనున్నట్లు సినీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

    రేపు పద్మాలయ స్టూడియోకు పార్థీవదేహం..

    రేపు పద్మాలయ స్టూడియోకు పార్థీవదేహం..

    కృష్ణ గారి పార్థీవ దేహాన్ని కాంటినెంటల్ ఆసుపత్రి నుంచి నానక్ రామ్‌ గూడలోని ఆయన నివాసానికి తరలించారు. మంగళవారం రాత్రి వరకు ఆయన పార్థీవ దేహాన్ని అక్కడే సినీ ప్రముఖుల సందర్శనార్థం కోసం ఉంచనున్నారు. అనంతరం రేపు ఉదయం 8 గంటలకు పద్మాలయ స్టూడియోకు అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టార్ కృష్ణ గారి పార్ధివదేహాన్ని తరలించనున్నట్లు సినీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.

    మహేశ్ బాబు కన్నీళ్లు తుడిచి..

    మహేశ్ బాబు కన్నీళ్లు తుడిచి..

    అయితే నానక్ రామ్ గూడలో ఉన్నప్పుడు కృష్ణగారి పార్థీవ దేహాన్ని సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తరలి వచ్చి నివాళులు అర్పించారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కృష్ణ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. హీరో మహేశ్ బాబు, కృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్. మహేశ్ బాబు కన్నీళ్లు తుడిచి మరి ఓదార్చారు. సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూతతో వ్యక్తిగతంగా గొప్ప మిత్రుడిని కోల్పోయానని కేసీఆర్ తెలిపారు.

     నేను ఈ మాట చెబితే నవ్వారు..

    నేను ఈ మాట చెబితే నవ్వారు..

    "సూపర్ స్టార్ కృష్ణ ముక్కుసూటిగా మాట్లాడేవారు. అరమరికలు లేకుండా మాట్లాడేవారు. మంచి విలక్షణ నటుడు. పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేశారు. వాళ్ల ఇంటికి చాలాసార్లు వచ్చాను. విజయనిర్మల గారు కన్నుమూసినప్పుడు కూడా పరామర్శించేందుకు వచ్చాను. అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప సినిమా తీశారు. నేను ఈ మాట చెబితే నవ్వారు. కేసీఆ్ గారు మీరు కూడా సినిమాలు చూస్తారా అన్నారు.

     అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..

    అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..

    నేను ఆ సినిమా (అల్లూరి సీతారామరాజు) చాలా సార్లు చూశానని చెబితే చాలా సంతోషించారు. మంచి దేశ భక్తిని ఉద్బోధించే, స్వతంత్ర పోరాటాన్ని స్ఫురింపజేసే గొప్ప సందేశాత్మక చిత్రాన్ని కృష్ణ గారు నిర్మించారు. వారి సీనియారిటీని, వారు చేసిన ప్రయత్నాన్ని గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వారి అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాం. మహేశ్ బాబు, మిగతా కుటుంబసభ్యులకు ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను" అని కేసీఆర్ పేర్కొన్నారు.

    3 గంటల సమయంలో..

    3 గంటల సమయంలో..

    సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను బుధవారం 3 గంటల సమయంలో నిర్వహించనున్నారు. అంతిమ సంస్కారాలను జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో గానీ.. లేదా ఆయన ఫామ్‌హౌస్‌లో గానీ నిర్వహించే అవకాశం ఉంది. దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని సీఎం కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు.

    English summary
    Superstar Krishna Passed Away: CM KCR Recalls Memories With Super Star Krishna And Consoled Mahesh Babu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X