For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూసైడ్‌ ప్రయత్నంపై ఆలీ క్లారిటీ.. తిండిలేక బాధపడ్డా.. పవన్ కల్యాణ్ పిలిస్తే..

  By Rajababu
  |
  సూసైడ్‌ ప్రయత్నంపై ఆలీ క్లారిటీ..

  టాలీవుడ్‌లో ప్రముఖ ఆలీ కంటే కెరీర్ రికార్డు గొప్పగా ఈతరం నటుల్లో ఎవరికీ ఉండదంటే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ఆయన చిన్నతనం నుంచి బాలనటుడిగా సీతాకోకచిలుక సినిమాతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత కొన్నాళ్లు అవకాశాలు లేక బాధపడ్డాడు. ఆ సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించానని వచ్చిన రూమర్లపై ఆలీ ఇటీవల ఓ టెలివిజన్ చానెల్‌తో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. తన వ్యక్తిగత విషయాలు, కెరీర్ అంశాలను మీడియాతో పంచుకొన్నారు. అవేమిటంటే..

   యాక్టర్‌గా స్థిరపడటానికి పదేళ్లు

  యాక్టర్‌గా స్థిరపడటానికి పదేళ్లు

  ఒక యాక్టర్‌ స్థిరపడటానికి ఒక నెల పట్టొచ్చు.. ఏడాది పట్టొచ్చు.. పదేళ్లు పట్టొచ్చు.. అవకాశం కోసం వేచి చూడాలి. అప్పుడే నటుడిగా నిలదొక్కకునే పరిస్థితి ఉంది. నేను దాదాపు బాలనటుడిగా 100 సినిమాలు చేశాను. అయినా మంచి అవకాశాలు రాలేదు.

   కమల్ హాసన్‌కే అవకాశాలు రాలేదు

  కమల్ హాసన్‌కే అవకాశాలు రాలేదు

  ఒక దశలో కమల్ హాసన్, తరుణ్ ఇంకా ఎందరో యాక్టర్లకు అవకాశాలు రాలేదు. యాక్టర్లకు అలాంటి సందర్భాలు ఎదురవ్వడం చాలా సహజం. అలాంటి సమయంలో ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అప్పుడు వాళ్లకు గ్యాప్ ఉండదు. అవకాశాలు లేని సమయంలో తన ప్రతిభకు పదునుపెట్టుకోవాలి.

   రాజబాబు నాకు స్ఫూర్తి..

  రాజబాబు నాకు స్ఫూర్తి..

  నాకు ది గ్రేట్ కమెడియన్ రాజబాబు ఇన్సిపిరేషన్. ఆయన స్ఫూర్తితోనే సినీరంగంలోకి వచ్చాను. ఏదో కోట్లు సంపాదించాలని సినిమాల్లోకి రాలేదు. నటనపై ఉన్న ఆసక్తిపైతోనే సినిమాల్లోకి వచ్చాను.

  నాకు గ్యాప్ వచ్చింది..

  నాకు గ్యాప్ వచ్చింది..

  సీతాకోక చిలుకలో నటించిన తర్వాత కొన్నాళ్లకు చాలా గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో అవకాశాలు లేవు. దాంతో ఇంటికి వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే మాది పేద కుటుంబం. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు. ఇద్దరి అక్కల పెళ్లి నాన్న చేశాడు. మరో ఇద్దరి చెల్లెలి పెళ్లిళ్లను నేను చేయాలని నిర్ణయం తీసుకొన్నాను.

   అనేక కష్టాలు పడ్డాను..

  అనేక కష్టాలు పడ్డాను..

  నన్ను నేను ఒకటే నమ్ముకున్నాను. నాకు టాలెంట్ ఉంది. ఏదో ఒకరోజు అవకాశాలు వస్తాయి. ఆఫర్ల కోసం ఎదురుచూడాలి అని అనుకొన్నాను. ఇంటి అద్దె కొట్టుకోవడానికి కష్టాలు పడ్డాను. తిండి తినడానికి ఇబ్బంది పడ్డాను కానీ ఆత్మహత్యకు ఎన్నడూ ప్రయత్నించలేదు.

   ఆత్మవిశ్వాసంతో సాధించా..

  ఆత్మవిశ్వాసంతో సాధించా..

  ఆఫర్లు లేని సమయంలో మనోస్థైర్యంతో నిలబడ్డాను. శక్తినంతా కూడగట్టుకొన్నాను. అధైర్య పడలేదు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొన్నాను. అమితాబ్ బచ్చన్ లాంటి వాడికే తప్పలేదు. వారి ముందు నేనెంత. వేషమడిగితే అమితాబ్‌ను నీ ముఖం అద్దంలో చూసుకో అన్నారు. ఎందరో గొప్పవాళ్లకు ఈ పరిస్థితి తప్పలేదు.

   చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చా

  చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చా

  ఒకవేళ ఏ నటుడికైనా అవకాశాలు లేక ఆత్మ విశ్వాసం లోపిస్తే నేను వెళ్లి కౌన్సిలింగ్ ఇస్తాను. వారికి ధైర్యాన్ని నూరిపోస్తాను. అంతే కాని నేను సూసైడ్ చేసుకొనేంత పిచ్చివాడ్ని కాను. నేను చచ్చిపోతే నా కుటుంబం ఏమై పోతుందో అనే భయం వెంటాడుతుంది అని ఆలీ అన్నారు.

  అంబానీకి అప్పిచ్చానని..

  అంబానీకి అప్పిచ్చానని..

  13 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేశాను అని ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న ఓ వార్తను ఆయన ఖండించారు. అంబానీకి నేనే అప్పు ఇచ్చానని రాస్తారు. చెన్నైలో ఉన్నప్పుడు సైకిల్‌పైనే షూటింగ్‌లకు వెళ్లా. హైదరాబాద్ వచ్చిన తర్వాత బైక్‌పై వెళ్లా. ఆ తర్వాత చిన్న కారులో తిరిగా. ఇప్పుడు మంచి కారులో వెళ్తున్నాను. మీరు చేస్తున్న ఇళ్లు బ్యాంక్ లోన్‌తో కొనుకొన్నాను అని ఆలీ చెప్పారు.

   పవన్ రాజకీయాలు లేవు..

  పవన్ రాజకీయాలు లేవు..

  పవన్ కల్యాణ్‌తో నేను ఎన్నడూ రాజకీయాలు మాట్లాడలేదు. జనసేన పార్టీ పెట్టినా ఎవరికీ చెప్పలేదు. నాతో కలిసి రండి అని ఎప్పుడూ పిలువలేదు. ఒకవేళ నన్ను పవణ్ కల్యాణ్ పిలిస్తే వెళ్లాను. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

   ఎన్టీఆర్ సమయంలో అలానే..

  ఎన్టీఆర్ సమయంలో అలానే..

  ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కొందరు సినీనటులు స్వచ్ఛందంగా వెళ్లారు. మరికొందరు పిలిస్తే వెళ్లారు వారే కాకుండా పలువురు సీఎంలకు సినీ నటులు మద్దతు తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా సినీ నటులు స్పందిస్తూ వస్తున్నారు. సినీ నటులకు రాజకీయాలు పూర్థిస్థాయి వృత్తి కాదు. యాక్టింగ్ మాత్రమే అని నమ్ముతారు అని ఆలీ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

  English summary
  Comedian Ali given the clarity on suicide attempt rumours. He said he never lost his confidence in critical situation. He patiently waited for offers. If somebody feels his situation worst, then I will go to that person to give councelling he furthur added. Ali said that He never spoke politics with Pawan Kalyan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X