For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నవ్వు చెదరలేదు: ఎంఎస్‌ నారాయణ క్షేమం

  By Srikanya
  |

  హైదరాబాద్‌: అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు ఎంఎస్‌ నారాయణ కన్నుమూశారంటూ ప్రముఖ మీడియా సంస్దలు, వెబ్ సైట్ లలో వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదు. ప్రముఖ సినీ హాస్యనటుడు ఎంఎస్ నారాయణ అస్వస్థతకు గురయ్యి హైదరాబాద్ కిమ్స్ హాస్పటిల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయనకు మలేరియా ఎటాక్ అయ్యినట్లు ప్రాధమికంగా వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి... ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చిందని అన్నారు. అయితే ఈ లోగా ఈ అనుకోని విషాద సంఘటన చోటు చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. కానీఅలాంటిదేమీ జరగటం పోవటం చాలా సంతోషకరమైన విషయం.

  ఎంఎస్ నారాయణ మరణించారన్న వార్తను ఆయన కుమారుడు విక్రమ్ ఖండించారు. కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎంఎస్ నారాయణ మదాపూర్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వైద్యులు ఎంఎస్ నారాయణకు వైద్యం అందిస్తున్నట్లు విక్రమ్ చెప్పారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  Comedian M S Narayana in safe condition

  వివరాల్లోకి వెళితే.... ఎంఎస్ నారాయణ స్వస్థలం భీమవరానికి సంక్రాంతి పండుగ నిమిత్తం వచ్చి ఆదివారం సాయంత్రం స్థానిక హోటల్‌లో గది తీసుకున్నారు. ఆహారం తీసుకున్న అనంతరం రాత్రివేళ ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.సన్నిహితులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఫుడ్ పాయిజన్ అని చికిత్స చేశారు.

  విషయం తెలుసుకున్న ఆయన కుమారుడు, సినీ హీరో విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సోమవారం సాయంత్రం వైద్యులు తెలిపారు.

  కెరీర్ విషయానికి వస్తే...

  మన తెలుగు తెరపై తాగుబోతు పాత్రలంటే ముందు గుర్తొచ్చే పేరు ఎమ్మెస్ నారాయణ పేరే. ఇప్పుడంటే తాగుబోతు రమేష్ వచ్చాడు కానీ ఇంతకుముందు తాగుబోతు పాత్ర అంటే ఎమ్మెస్ ని గుర్తు చేసుకోవాల్సిందే. తనదైన కొత్త తరహా మేనరిజమ్‌తో ఈ తరహా పాత్రలకు ఆయనకు ఆయనే సాటి. కృష్ణంరాజు, శ్రీకాంత్ నటించిన మా నాన్నకి పెళ్లి చిత్రంతో నటుడిగా ఆయన కెరీర్ ప్రారంభించి 17 ఏళ్లు దాటింది. ఈ ప్రయాణంలో 700ల చిత్రాలు పైగా పూర్తి చేసిన నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు ఎమ్మెస్ నారాయణ.

  ఎంఎస్ నారాయణ మాట్లాడుతూ... అతి తక్కువ కాలంలో 700 సినిమాల్లో నటించిన నటుడ్ని తానేనని చెప్పారు. ఈదిశగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తున్నానన్నారు. తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ సినీ రచయిత అవుదామని 1994లో హైదరాబాద్ వెళ్లాను. 1997లో నటుడిగా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నాను. ప్రస్తుతం 15 సినిమాల్లో నటిస్తున్నా. దూకుడు సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పారు.

  ఇక మాజీ ఎంపీ మెంటే పద్మనాభం సహకారంతోనే సినీ రంగంలోకి ప్రవేశించా. ఆయనే నాకు గాడ్‌ఫాదర్. హాస్యనటులు మల్లికార్జునరావు, ఏవీఎస్, శ్రీహరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఇటీవల మరణించడం నాన్నెంతగానో బాధించింది. వారు లేని లోటు చిత్రసీమకు తీర్చలేనిది. హైదరాబాద్‌లో తెలుగు సినిమా వాళ్లకు ఇబ్బంది లేకపోయినా.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లోనూ చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి.

  అలాగే... సినిమాల్లో ఎక్కువగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల మాండలికాన్ని వాడుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మాండలికంలో కూడా సినిమాలు రావచ్చు. ఎందుకంటే సినీ రంగానికి నైజాం ప్రాంతం నుంచే 50 శాతం ఆదాయం వస్తోంది. తెలంగాణ ఆర్టిస్టులతోనే పూర్తిస్థాయిలో సినిమాలు తీసే పరిస్థితి లేకపోలేదు. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సినీ షూటింగ్‌లకు సరిపడా మౌలిక వసతులు ఉన్నాయి. ఈదిశగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది.' అని అన్నారు.

  English summary
  Comedian MS Narayana health is good condition.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X