»   » మెగా హీరో షూటింగ్ లో ప్రమాదం: 'ధర్టీ ఇయిర్స్' ఫృధ్వీ కు గాయాలు,హాస్పటిల్ లో

మెగా హీరో షూటింగ్ లో ప్రమాదం: 'ధర్టీ ఇయిర్స్' ఫృధ్వీ కు గాయాలు,హాస్పటిల్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ధర్టీ ఇయిర్స్ ఇండస్ట్రీ గా పాపులర్ అయిన కమిడియన్ ఫృధ్వీ షూటింగ్ స్పాట్ లో గాయపడ్డారు. ఆయన్ని వెంటనే హాస్పటిల్ చేర్చించి చికిత్స చేస్తున్నారు. స్టంట్స్ జరిగినప్పడు ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ మేరకు ఈ విషయాన్ని ఫృధ్వి తన ఫేస్ బుక్ లో షేర్ చేసి అభిమానులకు తెలియచేసారు.

ఇంతకీ ఈ ప్రమాదం ఈ షూటింగ్ లో జరిగింది అంటే గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ హీరోగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ లో జరిగింది. రోప్ స్టంట్ ఫైటింగ్ సీన్ ని షూట్ చేస్తూండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఫృద్వి చిన్న పాటి గాయాలతో బయిటపడ్డారు.

వెంటనే చిత్రం యూనిట్ ఎలర్టై ఆయన్ను దగ్గరలోని హాస్పటిలో చేర్చించి ట్రీట్ మెంట్ ఇప్పించారు. ఆయన ఇప్పుడు కోలుకుంటున్నారు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్దించిన ఫ్యాన్స్ కు ఆయన ధాంక్స్ చెప్పారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలియచేసారు.

ఇంతకు ముందు సాయిదరమ్ తేజ చిత్రం సుప్రీమ్ సమయం లోనూ ఇలాగే యాక్సిడెంట్ చోటు చేసుకున్న సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. అప్పుడు అందులో విలన్ గా చేస్తున్న రవి, షేకింగ్ షేషులకు దెబ్బలు తగిలాయి. షూటింగ్ సమయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగవని సిని వర్గాలు చెప్తున్నాయి.

English summary
Prudhvi Raj shared in FB: Injured At A Ropeshot Fighting Sequence In Sai Dharam Tej's Shoot. I'm Fine Now. Thanks For The Prayers
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu