For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనసూయతో రిలేషన్ అని రాశారు..వాళ్ల గొంతుకొరికి చంపాలనిపించింది.. రఘు

  By Rajababu
  |

  టాలీవుడ్‌లో పాపులర్ కమెడియన్ రఘు కారుమంచి జీవితం పూలపాన్పు కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆది చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి దూసుకొచ్చాడు కమెడియన్ రఘు ఓ దశలో సర్వం కోల్పోయాడు. విశ్వాసం, ధైర్యంతో నిలదొక్కుకుని మళ్లీ ఆర్థికంగా పుంజుకొన్నాడు. రఘు జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. ఇటీవల ఓ యూట్యూబ్ చానెల్‌ నిర్వహించిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలను పంచుకొన్నారు. రఘు వెల్లడించిన విషయాలు ఆయన మాటల్లోనే.

  మా కుటుంబానిది తెనాలి

  మా కుటుంబానిది తెనాలి

  మా కుటుంబం తెనాలి నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాం. మా ఆవిడ కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు. ఆమె ఫ్యాక్షనిస్టు.. నేను యాక్షనిస్టు. నేను ఇంట్లో హైదరాబాదీ భాష, తెలంగాణ భాషనే మాట్లాడుతాను. నా పిల్లలు కూడా అలానే మాట్లాడుతారు.

   కాలేజ్‌లో గ్యాంగ్ వార్

  కాలేజ్‌లో గ్యాంగ్ వార్

  కాలేజ్ డేస్‌లో చాలా అగ్రెసివ్‌గా ఉండేవాడిని. ఏవీ కాలేజీలో ఓ గ్యాంగ్ ఉండేది. ఫైనల్‌ ఇయర్‌లో నేపాల్ టూర్ వెళ్లడానికి ప్లాన్ చేశాం. అయితే టూర్ మేనేజ్‌మెంట్ విషయంలో నాకు వేరే గ్యాంగ్‌కు గొడవ జరిగింది. దాంతో గ్యాంగ్‌లో ఒకడిని కొట్టాను. అయితే వాడు ఏమీ చేయలేక, మనసులో ఏదో పెట్టుకొని దేశ సరిహద్దులోని చెక్ పోస్ట్‌లో నాపై తప్పుడు విషయాలు చెప్పడంతో వారు నన్ను అదుపులోకి తీసుకొన్నారు.

   సరిహద్దులో అరెస్ట్ అయ్యాను

  సరిహద్దులో అరెస్ట్ అయ్యాను

  వారు అదుపులోకి తీసుకొని నేపాల్ సైనికులు నన్ను కొట్టారు. ఆ తర్వాత ఎంక్వేరీ చేసి మా నాన్న ఆర్మీలో పనిచేస్తాడు అని, నా ఐడెంటి కార్డులు చూశారు. ఆ తర్వాత స్టూడెంట్ అని వదిలేశారు. కానీ నాపై ఫిర్యాదు చేసిన వాడి అంతు చూడాలని అనుకొన్నాను. ఢిల్లీలో వాడిపై మర్డర్ ప్లాన్ చేశాను. కానీ ఫ్రెండ్స్ అడ్డుకోవడంతో అది అంతటితో ఆగింది.

   రేవంత్ రెడ్డి నా క్లాస్‌మెట్

  రేవంత్ రెడ్డి నా క్లాస్‌మెట్

  ఏవీ కాలేజ్‌లో నాకు రేవంత్ రెడ్డి క్లాస్‌మేట్. నేను రేవంత్ అన్న ఒకే బెంచ్‌లో కూర్చేనే వాళ్లం. జస్టిస్ సుభాషిణ్‌రెడ్డి నాకు సీనియర్. నా క్లాస్‌మెట్స్, బ్యాచ్‌మెట్లలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు ఉన్నారు. ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు. అప్పుడప్పుడు మేమంత కలుసుకొంటాం.

   బిజినెస్‌లో నష్టపోయాను

  బిజినెస్‌లో నష్టపోయాను

  ఓ దశలో నేను చాలా రకాలుగా బిజినెస్‌లో నష్టపోయాను. వరుస దెబ్బలు తగలడంతో పాతాళానికి పోయాను. షేర్ మార్కెట్‌లో బాగా బిజినెస్ చేశాను. నాకు స్టాక్ మార్కెట్‌పై మంచి పట్టు ఉంది. ఒక సమయంలో 22 వేల నుంచి 7 వేలకు సెన్సెక్స్ పడిపోయింది. దాంతో చాలా నష్టపోయాను. అప్పుడు మూడు నెలలు బెడ్‌రూం నుంచి బయటకు రాలేదు. బయటకు వచ్చి సూర్యుడిని చూసి దాఖలాలు లేవు. టెన్సన్‌లో కంప్యూటర్, ల్యాప్‌టాప్ పగులగొట్టాను.

   ఎన్టీఆర్ అంటే ఇష్టం

  ఎన్టీఆర్ అంటే ఇష్టం

  నాకు సీనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఆయనను ఆరాధిస్తూ పెరిగాను. అదృష్ణవశాత్తూ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది చిత్రంతో నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పటికీ అదే అనుబంధం కొనసాగతున్నది.

  భవిష్యత్‌లో రాజకీయాల్లోకి

  భవిష్యత్‌లో రాజకీయాల్లోకి

  సమాజ సేవ చేయాలని ఉంది. గిరిజనులు, గోండు ప్రజలకు సేవ చేయాలని ఉంది. అయితే వారికి సేవ చేసే అంత శక్తి లేదు. అందుకే వీలుంటే రాజకీయాల్లోకి వస్తాను. అధికారం ఉంటే సమాజానికి ఏంతో చేయవచ్చు. భవిష్యత్‌లో దేవుడు ఆ అవకాశం కల్పిస్తే నేను అందుకు సిద్ధం.

  రెమ్యునరేషన్ డిమాండ్ చేయను

  రెమ్యునరేషన్ డిమాండ్ చేయను

  నేను ఎప్పడూ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయను. గౌరవంగా ఎంత ఇస్తే అంత తీసుకొంటాను. డిమాండ్ చేస్తే ఐదు సినిమాలు మూడు అవుతాయి. సినిమాలను బట్టి డేట్స్ అడ్జస్ట్ చేస్తాను. వేర్వేరు ప్రదేశాల్లో షూట్ చేయడం వల్ల 15 రోజులపాటు డే అండ్ నైట్స్ పనిచేశాను.

   పూరీ నాకు ప్రామిస్ చేశాడు..

  పూరీ నాకు ప్రామిస్ చేశాడు..

  ఎస్ బాస్, చెంచా పాత్రలు ఎన్నాళ్లు చేయడమంటే అది మనపై ఆధారపడిలేదు. నా టాలెంట్‌ను దర్శకులు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. శమంతకమణిలో ఓ చిన్న పాత్ర కోసం అనుకొన్నారు. కానీ నా టాలెంట్ చూసి ఫుల్ లెంగ్త్ పాత్ర ఇచ్చారు. టెంపర్ చిత్రంలో ఓ సీన్‌లో యాక్టింగ్ చేసిన తర్వాత పూరీ జగన్నాథ్ విలన్ పాత్ర ఇస్తానని ప్రామిస్ చేశారు.

   ఇంకా టైం చాలా ఉంది

  ఇంకా టైం చాలా ఉంది

  జ్యోతిలక్ష్మి చిత్రంలో నన్ను మెయిన్ విలన్‌గా అనుకొన్నారట. కానీ ఎందుకో కుదర్లేదు. అయితే మంచి చిత్రంలో విలన్ పాత్ర ఇస్తాను అని పూరీ జగన్నాథ్ చెప్పారు. ఏది జరుగాలో, ఎప్పుడు జరుగాలో అనేది దైవం నిర్ణయిస్తుంది. సీనియర్ నటుడు కొండ వలస లక్ష్మణ్‌రావుకు 62 ఏళ్ల వయసులో బ్రేక్ వచ్చింది. ఇంకా ఆ వయసు రావడానికి 14 ఏళ్ల టైం ఉంది. టైం స్టార్ట్ అయితే నాకు ఒక్క ఏడాది చాలూ దుమ్ము రేపడానికి.

  తారక్‌తో అలా అని రాశారు.

  తారక్‌తో అలా అని రాశారు.

  పుట్టిన రోజున నా కూతురు ఎన్టీఆర్‌ను కలువాలని ఉన్నది అని చెప్పాను. దాంతో వారిని తారక్‌ను కలిసి విషేస్ అందుకొన్నారు. ఓ సందర్భంలో తారక్ తో అనుబంధాన్ని పంచుకొంటూ.. నా కూతురుకు బర్త్ డే విషెస్ చెప్పడానికి ఇంటికి తీసుకురమ్మన్నారు అని మీడియాకు చెప్పాను. దానిని మరో విధంగా ప్రొజెక్ట్ చేస్తూ.. రఘు కూతురును ఇంటికి తీసుకు రమ్మన్న ఎన్టీఆర్ అని హెడ్‌లైన్ పెట్టారు.

  గొంతు కొరికి చంపాలని

  గొంతు కొరికి చంపాలని

  అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. నన్ను టార్గెట్ చేసినా పర్వాలేదు. నేను గొట్టంగాడిని. కానీ ఎన్టీఆర్ హోదాను కనీసం దృష్టిపెట్టుకోవాల్సింది. అంత చీప్‌గా రాస్తారా? అప్పుడు నాకు వాడి గొంతు కొరికి చంపాలనిపించింది. ఎదురుగా ఉంటే గుద్దు గుద్ది చంపాలనిపించింది. ఐదు వేలో, పది వేలో లేదా పది లక్షల వ్యూస్ కోసం చెత్త రాతలు రాయవద్దు అని అన్నారు.

   అనసూయతో ప్రొఫెషనల్ రిలేషన్

  అనసూయతో ప్రొఫెషనల్ రిలేషన్

  అనసూయతో జబర్దస్త్ చేశాను. మా మధ్య కొంత ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే ఉంది. మలక్‌పేట్ దర్శన్ పహిల్వాన్ కూతురు అని తెలిసింది. అనసూయతో ఏదో సంబంధం ఉంది. అనసూయ ప్రెగ్నెంట్. అందుకే జబర్దస్త్ కార్యక్రమాన్ని మానేసింది లాంటి చెత్త వార్తలు రాశారు. ఆమెకు ఓ కుటుంబం ఉంది.. నాకు ఓ కుటుంబం ఉంది. నైతిక విలువలు దిగజార్చుతూ ఇలాంటి వార్తలు రాస్తే కుటుంబాలు ఏమైపోతాయి అనే ఆవేదన వ్యక్తం చేశారు.

  English summary
  Raghu Karumanchi is an Telugu actor who predominantly appears as a comedian. He acted in more than 150 films.He made his debut as an actor with the film Aadi starring Jr. NTR. He got break as an actor with the film Adhurs. He also acted in 1500 TV episodes in 32 titles on various channels. Recently Raghu speaks about his life journey with a popular youtube Channel in telugu Entertainment industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X