»   » ఫస్ట్‌లుక్‌తో ఇరుగదీశాడు.. కమెడియన్ శంకర్ హీరోగా.. శంభో శంకర్..

ఫస్ట్‌లుక్‌తో ఇరుగదీశాడు.. కమెడియన్ శంకర్ హీరోగా.. శంభో శంకర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shakalaka shankar Talks About His New Movie

ఆర్.ఆర్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎస్.కె. పిక్చ‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీధ‌ర్ ఎన్. ద‌ర్శ‌కుడిగా శంక‌ర్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మిస్తోన్న ఓ చిత్రానికిమ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా శంభో శంక‌ర అనే పేరును టైటిల్ గా ఖ‌రారు చేశారు.ఈ చిత్ర వివరాలను హీరో శంకర్, నిర్మాతలు రమణారెడ్డి, సురేష్ కొండేటి మీడియాకు వివరించారు.

అదృష్టంగా భావిస్తున్నా

అదృష్టంగా భావిస్తున్నా

చిత్ర క‌థానాయ‌కుడు శంక‌ర్ మాట్లాడుతూ, ` నేను హీరోగా ప‌రిచ‌యం కావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్నో క‌థ‌లు విన్న త‌ర్వాత నేను హీరోగా ఈ క‌థ అయితే బాగుంటుంద‌నే ఉద్దేశంతో చేస్తున్న చిత్ర‌మిది. న‌న్ను న‌టుడిగా ఆద‌రించిన ప్రేక్ష‌కులు హీరోగా కూడా ఈ సినిమాతో ఆశీర్వ‌దిస్తార‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమాకి ప‌నిచేస్తున్న 24 శాఖ‌ల‌కు సంబంధించిన వారంద‌రికీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా` అని అన్నారు.

శంక‌ర్‌కు నా కృత‌జ్ఞ‌త‌లు.

శంక‌ర్‌కు నా కృత‌జ్ఞ‌త‌లు.

ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఎన్ మాట్లాడుతూ, ` నా క‌థ‌ను , న‌న్ను న‌మ్మి, తొలి అవ‌కాశ‌మిచ్చిన నా ప్రియ మిత్రుడు శంక‌ర్ కు ముందుగా నా కృత‌జ్ఞ‌త‌లు. మా ఇద్ద‌ర్నీ న‌మ్మి నిర్మాత‌లుగా ముందుకు వ‌చ్చిన వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి కి కృత‌జ్ఞ‌త‌లు. అలాగే ఈ సినిమాకు ప్రాణం పెట్టి సంగీతాన్ని అందిస్తోన్న సాయి కార్తీక్ కు నా ప్ర‌త్యేక ధ‌న్య‌వాధాలు. అలాగే ఈ సినిమాకి ఫోటోగ్ర‌ఫీని అందిస్తోన్న రాజ‌శేఖ‌ర్ కు మ‌రియు ఇత‌ర టెక్నీషియ‌న్ల‌కు, నా టీమ్ అంద‌రికీ నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు` అని అన్నారు.

సురేష్ కొండేటి సహకారంతో

సురేష్ కొండేటి సహకారంతో

చిత్ర నిర్మాత వై. ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ, ` ఇప్ప‌టివ‌ర‌కూ డ‌బ్బై శాతం షూటింగ్‌తో పాటు, ఒక భారీ పైట్, అద్భుతంగా హీరో ఇంట‌ర‌డ‌క్ష‌న్ పాట‌ను చిత్రీక‌రించాం. హీరో శంక‌ర్, ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్, మ‌రో నిర్మాత సురేష్ కొండేటి స‌హ‌కారంతో అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా షూటింగ్ పూర్తిచేయ‌గ‌ల్గుతున్నాం` అని అన్నారు.

మంచి కథతో అద్భుతంగా

మంచి కథతో అద్భుతంగా

మ‌రో నిర్మాత ఎస్. కెపిక్చ‌ర్స్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ మంచి క‌థ‌తో నిర్మిస్తున్న అద్భుత‌మైన చిత్ర‌మిది. హీరో శంక‌ర్, మేకింగ్ ప‌రంగా, హై టెక్నిక‌ల్ వాల్యూస్ తో తెర‌కెక్కిస్తున్నాం. నా నిర్మాత‌ల వై. ర‌మ‌ణారెడ్డి తో క‌లిసి నిర్మిస్తున్న చిత్ర‌మిది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఈ సినిమాని నిర్మించ‌డం జ‌రుగుతోంది. ఈనెఖ‌రుక‌ల్లా షూటింగ్, మార్చి నెల‌లో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తిచేసి వేస‌వి కానుక‌గా విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తాం` అని అన్నారు.

నటీనటులు, సాంకేతిక వర్గం

నటీనటులు, సాంకేతిక వర్గం

శంక‌ర్ స‌ర‌స‌న కారుణ్య నాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రానికి ఛాయాగ్ర‌హ‌ణం: రాజ‌శేఖ‌ర్, సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: ఛోటా.కె ప్ర‌సాద్, మాట‌లు: భ‌వానీ వ‌ర‌సాద్, పాట‌లు: భాస్క‌ర భ‌ట్ల‌, సంతోష్ సాకే, కొరియోగ్ర‌ఫీ: భాను, సంట్స్: జోష్వా, ఆర్ట్ డైరెక్ట‌ర్: ర‌ఘు కుల‌క‌ర్ణి, ప్రొడ‌క్ష‌న్ చీఫ్: మ‌నీషా ప్ర‌సాద్, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: భిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌, నిర్మాత‌లు: వై. ర‌మ‌ణారెడ్డి, సురేష్ కొండేటి, క‌థ‌, స్ర్కీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీధ‌ర్. ఎన్.

English summary
Comedian Shankar become hero with Shambo Shankara movie. Ramana Reddy, Suresh Kondeti are the producer. Sreedhar introduced as Director. Karunya is the heroine for this movie. This movie is getting ready for the release. In this occassion, Film unit speaks to media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X