»   » అబ్బాయిలతో కలసి మందు కొడతా : ఓపెన్‌గా ఒప్పుకున్న తెలుగు నటి

అబ్బాయిలతో కలసి మందు కొడతా : ఓపెన్‌గా ఒప్పుకున్న తెలుగు నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అలా మొదలైంది' సినిమాతో బాగా పాపురల్ అయిన నటి స్నిగ్ద. అడపిల్లే అయినా మగరాయుడి గెటప్ లో ఆమె పండించే హాస్యానకి మంచి డిమాండ్ ఉంది. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ స్నిగ్ద అలానే ఉంటుంట.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఇప్పుడే కాదు... చిన్నప్పటి నుండి నేను టామ్ బాయ్ గానే పెరిగానని స్నిగ్ద చెప్పుకొచ్చారు. సినిమాలు, సంగీతంపై ఆసక్తితోనే తాను చేస్తున్న మంచి జాబ్ వదిలేసి ఈ రంగం వైపు వచ్చినట్లు ఆమె తెలిపారు. తాను పరమ శివ భక్తురాలినని, ప్రతీ సంవత్సరం శివమాల ధరిస్తానని తెలిపారు.

 అవకాశం ఇవ్వలేదు

అవకాశం ఇవ్వలేదు

తనకు సంగీతం అన్నా, పాటలు పాడటం అన్నా చాలా ఇష్టం. సింగర్ కావడానికి చాలా ట్రై చేసారు. కానీ ఏ సంగీత దర్శకుడు తనకు అవకాశం ఇవ్వలేదని స్నిగ్ద చెప్పుకొచ్చారు.

 ఆమె ద్వారానే

ఆమె ద్వారానే

తనను ఓ ఫ్రోగ్రామ్ లో చూసిన నందినీ రెడ్డి తాను తెరకెక్కించిన ‘అలా మొదలైంది' సినిమాలో అవకాశం ఇచ్చిందని, ఆ సినిమాలో తన పాత్రకు మంచి పేరు రావడంతో వరుస అవకాశాలు వస్తున్నాయని స్నిగ్ద చెప్పుకొచ్చారు.

 అబ్బాయిలతో కలిసి మందు కొడతాను

అబ్బాయిలతో కలిసి మందు కొడతాను

నాకు ఎందుకనో అమ్మాయిలతో సెట్ కాదు. మేకప్ వేసుకోవడం అంటే నచ్చదు. టైమ్ ప్రకారం పద్దతిగా నడుచుకోవడం అంటే ఇష్టం ఉండదు. నేను ఎక్కువగా అబ్బాయిలతోనే స్నేహం చేసాను, వారితో కలిసి మందు కొడతాను, బయట తిరుగుతాను అని స్నిగ్ద చెప్పుకొచ్చారు.

 అమ్మాయిల కంటే అబ్బాయిలే బెటర్

అమ్మాయిల కంటే అబ్బాయిలే బెటర్

అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు ఫ్రాంక్‌గా ఉంటారు. ఓ పెగ్‌ పడితే మొత్తం నిజం మాట్లాడేస్తారు. కాలేజ్‌లో చదివే రోజుల్లో అబ్బాయి గెటప్‌లో ఉండి అమ్మాయిలకు సైట్‌ కొట్టేదాన్నని అని స్నిగ్ద తెలిపారు.

 లవ్ ప్రపోజల్స్ వచ్చాయి

లవ్ ప్రపోజల్స్ వచ్చాయి

నా లైఫ్ స్టైల్, అబ్బాయిలా ఉండే నా గెటప్ చూసి ఓ వ్యక్తి తనకు లవ్ ప్రపోజ్‌ చేశాడు, కానీ నాకు అలాంటివి నచ్చదు.... నువ్వంటే నాకు ఇష్టమే, ఫ్రెండ్స్ గా ఉందాం, వేరే రిలేషన్ వద్దు అని చెప్పినట్లు స్నిగ్ద తెలిపారు.

English summary
Comedian Snigdha about her tomboy lifestyle and acting career. Snigdha acted as an artist in ‘Ala Modalaindi’, ‘Dammu’, ‘Rushi’, ‘Mem Vayasuku Vacham’ and ‘Routine Love Story’ ‘Okkadine’ movies.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu