For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  లంగాలోకి చేయివెళ్లడంతో రాధిక కొట్టింది: చిరంజీవి లక్కే, పవన్ ఓరేయ్...!

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: ఒకప్పుడు తెలుగులో టాప్ కమెడియన్లలో ఒకరిగా వెలుగొందిన హాస్యనటుడు సుధాకర్ అనారోగ్యం కారణంగా చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి తేరుకున్న ఆయన మళ్లీ సినిమా రంగం వైపు అడుగులు వేస్తున్నారు. సాయి రామ్ శంకర్ హీరోగా తెరకెక్కుతున్న 'వాడు నేను కాదు' అనే చిత్రంలో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

  మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్ సినిమా ప్రయత్నాలు చేసే సమయంలో ఒకే రూములో ఉండే వారు. ఆ మధ్య ఓ సారి సుధాకర్ తన తొలిరోజుల గురించి గుర్తు చేసుకుంటూ నేను, చిరంజీవి, హరి ప్రసాద్ ఒకే రూములో ఉండేవారం...చిరంజీవి అన్నం వండేవాడు, తాను కూరలు చేసేవాడిని, మార్కెట్ నుండి కావాల్సిన హరి ప్రసాద్ తీసుకువచ్చేవాడని సుధాకర్ చెప్పుకొచ్చారు.

  సుధాకర్ నటిస్తున్న రీ ఎంట్రీ మూవీ 'వాడు నేను కాదు' మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ జీవితంలోని మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పకొ చెప్పుకొచ్చారు.

  రాధిక తనపై చేయి చేసుకున్న సంఘటన గురించి...
  తమిళంలో నేను హీరోగా చేస్తున్న రోజులు. రాధికతో తొలి సినిమా. ఆమె ఎం.ఆర్.రాధ గారి కూతురు కావడంతో కాస్త భయంగా ఉండేది. అప్పటికే వాళ్ల నాన్న ఒకర్ని గన్ తో షూట్ చేసిన విషయం అప్పట్లో ఓ సెన్సేషన్. ఆయన కూతురుతో నేను సినిమా చేస్తుండటంతో సెట్లో అంతా కాస్త జాగ్రత్తగా ఉండాలని అనేవారు. మా ఇద్దరి మధ్య తొలిసీన్ రాధిక పరుగెత్తుకుంటూ నా దగ్గరికి రాగానే నేను ఎత్తుకుని తిప్పాలి. అయితే ఆమెను ఎత్తుకున్న సమయంలో అనుకోకుండా నా చేయి ఆమె లంగాలోకి వెళ్లింది. దీంతో రాధికకు కోపం వచ్చి నా చెంపపై గట్టిగా కొట్టింది. తొలిరోజు షూటింగులోనే ఇలా అయిందేంటి అని షాకయ్యాను. షూటింగ్ బాగా రావడానికి తమ మధ్య సాన్నిహిత్యం పెరిగాలని కలిసి సినిమాలకు వెళ్లడం, కలిసి డిన్నర్ కు వెళ్లడం లాంటివి చేయాలన్నారు. తర్వాత ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. 13 సినిమాల్లో కలిసి నటించాం అని సుధాకర్ చెప్పుకొచ్చారు.

  స్లైడ్ షోలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, రాజమౌళి గురించి.... తన ఆరోగ్యం గురించి సుధాకర్ చెప్పిన విశేషాలు..

  మోహన్ బాబు గురించి...

  మోహన్ బాబు గురించి...

  ఓసారి షూటింగులో మోహన్ బాబు గారు ఓ డ్రెస్ వేసుకోమంటే వేసుకోలేదు. పెద్దగా గొడవేమీ కాలేదు. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ సంఘటన తర్వాత మా ఇంటికథ, అల్లుడు గారు, యమజాతకుడు చేసాం. ఆయన పైకి కరుకుగా కనిపించినా మనసు వెన్న. ఆయన సొంత బేనర్లో పోస్టుమెన్ సినిమా కూడా చేసాను అన్నారు సుధాకర్.

  తాగడం వల్ల కాదు..

  తాగడం వల్ల కాదు..

  నేను బాగా తాగడం వల్లనే అనారోగ్యం అనే ప్రచారం జరిగింది. కానీ అది కారణం కాదు. ఎప్పుడూ లిమిట్ గానే తాగేవాన్ని. బ్రెయిన్ స్టోక్ కావడం వల్ల అలా జరిగింది.

  మా అసోసియేషన్లో ఇపుడు అలా లేదు..

  మా అసోసియేషన్లో ఇపుడు అలా లేదు..

  మా అసోసియేషన్ నుండి బర్త్ డేకు గ్రీటింగులు పంపుతారు. బోకేస్ పంపుతారు. మురళీ మోహన్ గారు ప్రెసిడెంటుగా ఉన్నపుడు ఫోన్లు కూడా చేసే వారు... మరి రాజేంద్ర ప్రసాద్ వచ్చిన తర్వాత ఆ సిస్టమే లేదనుకుంటా. ఆయనతో బోలెడు సినిమాలు చేసాను అన్నారు సుధాకర్.

  పునాది రాళ్లు ఆఫర్ నాకే...

  పునాది రాళ్లు ఆఫర్ నాకే...

  పునాది రాళ్లు సినిమాలో ఆఫర్ ముందు నాకే వచ్చింది. అయితే అప్పటికే నేను వేరే షూటింగులో ఉన్నాను. రెండు షెడ్యూల్స్ అయ్యాయి షూటింగ్ నడుస్తుంది అన్నారు.

  నా వల్ల కాదు.. చిరంజీవి లక్కు బావుంది

  నా వల్ల కాదు.. చిరంజీవి లక్కు బావుంది

  తమిళ సినిమాలో చేస్తున్న సమయంలో నాకు వేరే సినిమాలలో చేయొద్దనే అగ్రిమెంటు ఉండటంతో పునాది రాళ్లు సినిమాలో చేయనని చెప్పాను. వరప్రసాద్(చిరంజీవి) ఉన్నాడని, బాగా చేస్తాడని చెప్పాను అంతే. నా వల్లే చిరంజీవికి ఆ సినిమా చాన్స్ వచ్చిందని అనడం సరికాదు అన్నారు సుధాకర్.

  చిరంజీవి పేరు

  చిరంజీవి పేరు

  ఇద్దరం కలిసి రూంలో ఉన్నపుడు సరదాగా నాయనా చిరంజీవి త్వరగా రెడీ అవ్వు ఇనిస్టిట్యూట్ వెళ్లాలి అనేవాన్ని. అప్పుడు ఆయన పేరు వరప్రసాదే. ఆ తర్వాతే చిరంజీవి అయింది. నేను చిరు అని పిలుస్తాను. ఆంజనేయ స్వామి కలలో కనిపించి చిరంజీవి పేరు పెట్టుకోవాలని సూచించాడట అని సుధాకర్ చెప్పారు.

  పవన్ కళ్యాణ్ ఓరేయ్ అని పిలవడానికి ఇబ్బంది పడ్డాడు

  పవన్ కళ్యాణ్ ఓరేయ్ అని పిలవడానికి ఇబ్బంది పడ్డాడు

  పవన్ కళ్యాణ్ కి నేనంటే ఇష్టం. అన్నయ్యా అని పిలుస్తాడు. సుస్వాగతం షూటింగ్ చేసేపుడు నన్ను ఓరేయ్ అని పిలవాలి. నిన్ను అలా అంటే ఎలాగుంటుంది అన్నాయ్యా అనేవాడు. ఇది సినిమా, నిజం కాదు ఎలా చేయాలంటే అలా చేయాలి అని చెప్పే వాడిని అని సుధాకర్ తెలిపారు. నా కొడుకు పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు.

  English summary
  In his latest interview Comedian Sudhakar said interesting poins about Radhuka, Chiranjeevi, Pawan Kalyan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X