»   » చిరంజీవి వంట చేసాడు: గతం గుర్తుచేసుకున్న సుధాకర్

చిరంజీవి వంట చేసాడు: గతం గుర్తుచేసుకున్న సుధాకర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు తెలుగులో టాప్ కమెడియన్లలో ఒకరిగా వెలుగొందిన హాస్యనటుడు సుధాకర్ అనారోగ్యం కారణంగా చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి తేరుకున్న ఆయన మళ్లీ సినిమా రంగం వైపు అడుగులు వేస్తున్నారు. సాయి రామ్ శంకర్ హీరోగా తెరకెక్కుతున్న 'వాడు నేను కాదు' అనే చిత్రంలో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్ సినిమా ప్రయత్నాలు చేసే సమయంలో ఒకే రూములో ఉండే వారు. ఈ విషయాన్ని సుధాకర్ ఇటీవల మీడియాతో పంచుకుంటూ... నేను, చిరంజీవి, హరి ప్రసాద్ ఒకే రూములో ఉండేవారం...చిరంజీవి అన్నం వండేవాడు, తాను కూరలు చేసేవాడిని, మార్కెట్ నుండి కావాల్సిన హరి ప్రసాద్ తీసుకువచ్చేవాడని సుధాకర్ చెప్పుకొచ్చారు.

Comedian Sudhakar's Re Entry

మొదట్లో తాను తమిళ సినిమాల్లో బిజీ అయిపోయానని, చిరంజీవి తెలుగు సినిమాల్లో బిజీ అయిపోయాడని సుధాకర్ చెప్పుకొచ్చాడు. తాను ఆపదలో ఉన్నపుడు చిరంజీవి ఆదుకున్న విషయాన్ని సుధాకర్ గుర్తు చేసుకున్నారు. కెరీర్ తొలి నాళ్లలో తమిళనాట యంగ్ హీరోగా వరుస విజయాలతో సంచలనం సృష్టించిన సుధాకర్.....తర్వాత తెలుగులో హాస్య పాత్రలు చేస్తూ బిజీ అయిపోయాడు.

English summary
Comedian Sudhakar's Re Entry details.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu