»   » తాగుబోతు రమేష్...ఘనంగా వివాహం (ఫొటో ఫీచర్)

తాగుబోతు రమేష్...ఘనంగా వివాహం (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ ఇప్పుడు వరస పెళ్లిళ్లతో బిజీగా మారింది. రెండు రోజుల క్రితం మంచు మనోజ్ వివాహం హడావిడిలో మునిగి తేలిన తెలుగు పరిశ్రమ తాజాగా ప్రముఖ హాస్య నటుడు...తాగుబోతు రమేష్.. వివాహానికి శుభాకాంక్షలు తెలియచేసే పనిలో బిజీగా ఉంది. రమేష్ కు సినీ పరిశ్రమలోనూ అభిమానులు ఎక్కువే

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తెలుగు కమెడియన్ తాగుబోతు రమేష్ ఓ ఇంటివాడు అయ్యారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా ...భిక్కనూర్ రైల్వేస్టేషన్ గ్రామానికి చెందిన చెందిన స్వాతితో రమేష్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.ఈ నెల 28 కామారెడ్డిలో వివాహం జరుగింది.

ఈ మేరకు ఫొటోలు బయిటకు వచ్చాయి. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ ఫొటోలు షేర్ అవుతున్నాయి. తమ్ముడు అంటూ ఆయన స్లాంగ్ లో చెప్పే డైలాగుకు ఫేస్ బుక్,ట్విట్టర్ లలో విపరీతమైన ఆదరణ ఉంది. ఈ నేపధ్యంలో ఆయనకు అభిమానులూ ఓ రేంజిలో ఉన్నారు. ఇప్పుడు వారంతా ఆయన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.

వివాహం, శుభలేఖ, నిశ్చితార్దం కు చెందిన రమేష్ ఫొటోలు ఇక్కడ స్లైడ్ షోలో

రిసెప్షన్ ఎప్పుడూ...

రిసెప్షన్ ఎప్పుడూ...

ఈ నెల 30వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది.

ప్రముఖులు అంతా

ప్రముఖులు అంతా

ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. ముఖ్యంగా కామెడీ నటులు మొత్తం ఈ రిసెప్షన్ కు వెళ్లనున్నారు.

తాగి వచ్చే నాన్నే నాకు స్పూర్తి

తాగి వచ్చే నాన్నే నాకు స్పూర్తి

తన తండ్రే ఆయనకు స్ఫూర్తి అని చెప్పారు. తన నాన్న బొగ్గు గనుల్లో పని చేసే వారని.. బాగా అలసిపోయి రాత్రి మద్యం సేవించే వారని తెలిపారు. అయితే నాన్న మద్యం సేవించినప్పుడు ప్రవర్తించే తీరును తన తల్లి ముందు ఆయన నటించి చూపేవారని పేర్కొన్నారు. ఆ రకంగా తాగుబోతు నటన తన తండ్రి నుంచే నేర్చుకున్నాని చెప్పారు.

అలవాటులేదు..

అలవాటులేదు..

తన పాత్రలు చూసిన వారు తనను తాగుబోతు అనుకుంటారని, అయితే తనకు మద్యం సేవించడం అలవాటు లేదని పేర్కొన్నారు.

ఆ సిట్యువేషన్ లేదు

ఆ సిట్యువేషన్ లేదు

తాగుబోతు క్యారెక్టర్ చేయకపోతే సినిమాల్లో నటించే అవకాశాలు దొరకని పరిస్థితులు ఉన్నాయన్నారు. తాగి నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయని తెలిపారు.

ఉంది కానీ...

ఉంది కానీ...

సాధారణ క్యారెక్టర్లు చేయాలని తనకూ ఉందని.. అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని చెప్పారు.

ముఖ్యంగా ఈ కమిడెయన్స్ అంటే...

ముఖ్యంగా ఈ కమిడెయన్స్ అంటే...

సినీ పరిశ్రమలో ఉన్న అందరి కమెడియన్లు ఇష్టమన్నారు. వ్యక్తిగతంగా బ్రహ్మానందం, అలీలు అంటే చాలా ఇష్టమన్నారు. 'మన కంటే.. మన పని మాట్లాడాలి'... అని పేర్కొన్నారు.

తొలి చిత్రం

తొలి చిత్రం

తాగుబోతు రమేష్ 2005లో 'జగడం' చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించాడు.

గుర్తింపు రాకపోయినా

గుర్తింపు రాకపోయినా

మహాత్మ, భీమిలి కబడ్డీ జట్టు, ఈ వయసులో చిత్రాల్లో నటించాడు. అయితే ఈ చిత్రాలు రమేష్‌కు పెద్దగా గుర్తింపు తేలేదు.

పాపులారిటీ..

పాపులారిటీ..

నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అలా మొదలైంది' చిత్రంలో క్లైమాక్స్ సీన్లో రామేష్ పోషించిన తాగుబోతు పాత్ర సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తాగుబోతు రమేష్‌గా పాపులరయ్యాడు.

స్టార్ హీరోలతో

స్టార్ హీరోలతో

అతి తక్కువ సమయంలోనే తాను స్టార్ హీరోలతో పనిచేసే అవకాసం పొందటం అదృష్టమని అన్నారు.

శుభాకాంక్షలు...

శుభాకాంక్షలు...

జీవితంలో ఒకింటి వాడు అవుతున్న ఈ శుభ సందర్బంలో ... వన్ ఇండియా తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
Thagubothu Ramesh, famous comedian known for his drunk roles in films, got married today, May 28, in his home town Nizamabad. The marriage is said to be an arranged one and the bride, Swathi, is from Bhikkanuru village.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu