సల్మాన్ ఖాన్‌పై సామాజిక కార్యకర్త ఫిర్యాదు
సల్మాన్ ఖాన్ 2002లో కారు నడుపుతూ దారిపక్కనున్న వారిని డీకొట్టడంతో వారి మరణానికి కారణమయ్యారనే కేసుపై ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ కేసు వివరాలు, కోర్టులో జరిగిన విచారణ అంశాలను తెలిపేందుకు సల్మాన్ ఇటీవల ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశారు.
ఆ సైట్‌లో కేసు వివరాలను తెలియజేయడంతో పాటు ప్రజల నుంచి వ్యాఖ్యలను కోరతున్నారని పాటిల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పాటిల్ శనివారం బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా అక్కడి పోలీసులు నమోదు చేసుకోకపోవడంతో న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఫిర్యాదును స్వీకరించిన మెజిస్ట్రేట్ ఆగస్టు ఐదుకు విచారణను వాయిదా వేసింది.
సల్మాన్‌పై ఉన్న కేసుల విషయం మీడియాలో తప్పుడు రకంగా ప్రచారం జరుగుతోంది. దీంతో పరువు పోతోందని భావించిన సల్మాన్...అభిమానులకు, మీడియాకు తన కేసులకు సంబంధించిన వాస్తవాలు ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ప్రత్యేకంగా వెబ్ సైటే ప్రారంభించాడు. www.salmankhanfiles.com పేరుతో రూపొందించిన ఈ వెబ్ సైట్లో తన కేసుకు సంబంధించిన తాజా వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటారు. తన గురించి వాస్తవాలు ఎప్పటికప్పుడు వెల్లడించేందుకే ఈ వెబ్ సైట్ ప్రారంభించినట్లు సల్మాన్ ఖాన్ స్పష్టం చేసారు.


Click it and Unblock the Notifications












