»   » దుర్మార్గుడు మావాడే అని చిరంజీవి చెప్పినా... ఇంకా వీడని అయోమయం!

దుర్మార్గుడు మావాడే అని చిరంజీవి చెప్పినా... ఇంకా వీడని అయోమయం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక 150వ చిత్రం అనుకున్న దానికికంటే పెద్ద హిట్టే అయింది. ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరిగరాస్తూ ఈ సినిమా దూసుకెలుతోంది. మెగాస్టార్ సినిమా చూడాలని పదేళ్లుగా ఆకలితో ఎదురు చూస్తున్న అభిమానుకులు 'ఖైదీ నెం 150' సినిమా ద్వారా విందు భోజనం లాంటి వినోదం అందించారు దర్శకుడు వివి వినాయక్.

అన్నయ్య 150తో మొదలైన అన్న సెకండ్ ఇన్నింగ్స్ ఇక నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. 150వ సినిమా చూసి పూర్తి సంతృప్తి చెందిన అభిమానుల ఆలోచనలు ఇపుడు 151, 152 వ సినిమాలు ఎవరితో చేయబోతున్నారు అనే దిశగా సాగుతున్నాయి.

ఇటీవల ఇంటర్వ్యూలో 151 సినిమా ఎవరు నిర్మిస్తున్నారు అనే ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇస్తూ... దుర్మార్గుడు మావాడే అంటూ రామ్ చరణ్ పేరు చెప్పిన చిరంజీవి దర్శకుడు ఎవరనే దానిపై సరైన క్లారిటీ ఇవ్వలేదు.

 151 సినిమా బోయపాటితో అనుకున్నారు కానీ...?

151 సినిమా బోయపాటితో అనుకున్నారు కానీ...?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించే 151వ సినిమా గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో బోయ‌పాటి ద‌ర్శ‌కుడిగా అనుకున్నాం. కానీ బోయ‌పాటితో కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మ‌వుతోంది. ఆయన ఇటీవలే ఓ సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమా పూర్తి కావడానికి ఇంకా సమయం పడుతుందని అల్లు అరవింద్ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు.

 కథ బాగా రావాలి, ఈ లోగా చరణే చేస్తాడు

కథ బాగా రావాలి, ఈ లోగా చరణే చేస్తాడు

బోయపాటితో చిరంజీవి సినిమాకు అనుకున్న కథ సుమారుగానే సిద్ధ‌మైంది. ఇంత పెద్ద హిట్ త‌ర్వాత భ‌యం వేసింది. మరింత జాగ్రత్త‌గా ఉండాలి. అందుకే నేను వేచి చూస్తున్నా. ఆర్నెళ్ల‌పాటు కథపై బాగా కసరత్తు చేసిన తర్వాత బాగా వ‌చ్చాకే చేయాల‌న్న‌ది ఆలోచ‌న‌. ఈలోగానే చ‌ర‌ణ్ వేరొక సినిమా(151) చిరంజీవితో చేస్తారు అని అల్లు అరవింద్ తెలిపారు.

 సురేందర్ రెడ్డి

సురేందర్ రెడ్డి

చరణ్ బాబుతో హిట్ సినిమా చేసాడు కాబట్టి... చిరంజీవి చేయబోయే తర్వతి సినిమాలకు సురేందర్ రెడ్డి పేరు కూడా వినిపించడం సహజం. 151వ సినిమా రామ్ చరణ్ నిర్మిస్తాడనే విషయం తప్ప ఇంకా ఏ విషయం కొలిక్కి రాలేదని అల్లు అరవింద్ తెలిపారు.

 ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం కథ కాదు

ఇంత పెద్ద హిట్ కావడానికి కారణం కథ కాదు

‘ఖైదీ నెం 150' మూవీ ఇంత పెద్ద హిట్టవ్వడానికి కారణం... క‌థాంశాన్ని మించి చిరంజీవి కంబ్యాక్ వెయిటేజీ చూడాల‌నే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌చ్చార‌ని నేను న‌మ్ముతాను. ఓవ‌ర్సీస్‌లోనూ రియాక్ష‌న్ పెద్ద పండుగ‌లా ఉంది. చిరంజీవి గారిని చూడాల‌ని సెల‌వులు పెట్టి మ‌రీ థియేట‌ర్ల‌కు వ‌చ్చారు. మ‌స్క‌ట్‌లో తెలుగువారికి కంపెనీలు సెల‌వులిచ్చాయంటే అర్థం చేసుకోవ‌చ్చు అని అల్లు అరవింద్ తెలిపారు.

ఐదేళ్లుగా అనుకుంటున్నాం

ఐదేళ్లుగా అనుకుంటున్నాం

‘ఖైదీ నెం 150' మూవీని రామ్‌చ‌ర‌ణ్ నిర్మించ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంది. ఐదేళ్లుగా మెగాస్టార్ ఇంట్లో ఓ బ్యాన‌ర్‌ని ఎస్టాబ్లిష్ చేయాల‌నుకుంటున్నా స‌రైన వేదిక ఈ 150వ సినిమా అనిపించి రామ్‌చ‌ర‌ణ్ ప్రారంభించారు అని అల్లు అరవింద్ తెలిపారు.

English summary
Actor Ram Charan, who has produced his father Chiranjeevi's comeback film “Khaidi No 150”, will also be bankrolling his next project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu