»   » కుట్ర చేస్తున్నారంటూ హాట్ హీరోయిన్ ఆవేదన!(ఫోటో ఫీచర్)

కుట్ర చేస్తున్నారంటూ హాట్ హీరోయిన్ ఆవేదన!(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు దక్షిణాదిన టాప్ హీరోలందరితోనూ జతకట్టిన హీరోయిన్ శ్రీయకు ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గిపోయాయి. తన అవకాశాలు తగ్గడానికి కారణం కొన్ని శక్తులే అని, తనకు కావాలనే అవకాశాలు రాకుండా కుట్ర చేస్తున్నారని శ్రీయ ఆరోపిస్తోంది. తమిళ సినిమా పరిశ్రమలోని కొందరిపై ఆమె ఈ ఆరోపణలు చేస్తోంది.

తమిళ దర్శకుడు బాలా తన చిత్రం నుండి శ్రీయను అర్దాంతరంగా తప్పించడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. బాలా దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో తొలుత శ్రీయను కథానాయికగా ఎంపిక చేసారు. సినిమా షూటింగు కోసం ఆమెను చెన్నై కూడా రప్పించారు. అంతా ఒకే అయిన సినిమా షూటింగ్ మొదలవుతుందనే తరుణంలో ఆమెను తప్పించి వరలక్ష్మిని హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఈ పరిణామాలపై శ్రీయ స్పందిస్తూ....తమిళ చిత్ర పరిశ్రమలో తనకు వ్యతిరేకంగా కొందరు కుట్ర చేస్తున్నారని, అయితే ఎవరి మీదా నేను ఫిర్యాదు చేయదలుచుకోలేదని తెలిపారు. స్లైడ్ షోలో శ్రీయకు సంబంధించిన పర్సనల్ విషయాలు, హాట్ ఫోటోలు...

శ్రీయ

శ్రీయ


11 సెప్టెంబర్ 1982లో జన్మించిన శ్రీయ వయసు 30 సంవత్సరాలు దాటింది. ఉత్తరఖండ్ రీజియన్లోని డెహ్రడూన్‌లో శ్రీయ జన్మించింది.

విద్యాబ్యాసం

విద్యాబ్యాసం


హరిద్వార్‌, ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్‌లో శ్రీయ పాఠశాల విద్య సాగింది. ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పొందింది.

తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభం

తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభం


శ్రీయ క్లాసికల్ డాన్సర్ కావడంతో ఓ వీడియో చిత్రీకరణలో పాల్గొంది అలా ఆమె సినిమా వాళ్ల దృష్టిలో పడింది. ఇష్టం అనే తెలుగు సినిమాలో తొలి అవకాశం దక్కించుకుంది.

సంతోషం సినిమాతో గుర్తింపు

సంతోషం సినిమాతో గుర్తింపు


వెంటనే నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘సంతోషం' సినిమాలో అవకాశం దక్కడంతో శ్రీయకు మంచి గుర్తింపు వచ్చింది.

వరుస అవకాశాలు...

వరుస అవకాశాలు...


సంతోషం సినిమా తర్వాత శ్రీయకు వరుస అవకాశాలు వచ్చాయి. అగ్రహీరోలతో చేసే అవకాశం దక్కించుకుంది. బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి, చిరంజీవితో ఠాగూర్ లాంటి చిత్రాల్లో నటించింది.

దక్షిణాది భాషల్లో బిజీ...

దక్షిణాది భాషల్లో బిజీ...


తెలుగులో పలు చిత్రాలు చేయడంతో దక్షిణాది బాషలైన తమిళం, మళయాలం, కన్నడ బాషల్లోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో శివాజీ చిత్రంలోనూ నటించింది శ్రీయ.

అప్ అండ్ డౌన్స్

అప్ అండ్ డౌన్స్


అయితే శ్రీయ కెరీర్ వరుస హిట్లతో సాఫీగా ఏమీ సాగలేదు. ఓ సినిమా హిట్టయితే మరో సినిమా ఫట్. ఇలా ఒడిదుడుకులతోనే శ్రీయ కెరీర్ సాగింది. అయితే నెం.1 హీరోయిన్‌గా మాత్రం ఆమె గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

ప్రస్తుతం శ్రీయ అక్కినేని మూడుతరాల హీరోలు కలిసి నటించిన ‘మనం' చిత్రంలో నాగార్జునకు జోడీగా నటిస్తోంది. దీంతో పాటు ఓ తమిళ చిత్రం, మరో హిందీ చిత్రంలో నటిస్తోంది.

English summary
Shriya alleges conspiracy against her. Speaking about it Shriya felt there was some conspiracy hatched against her in the industry.Recently she was offered role in Bala's film Tarai Tapatai. She even landed in Chennai for the shooting. However she was shocked to know that she was replaced by Varalakshmi Sarath Kumar at the last moment.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu