twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియన్ సినీ చరిత్రలో బ్యాన్ చేయబడ్డ సినిమాలు... (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాల విషయంలో వివాదాలు ఏర్పడటం చూస్తూనే ఉన్నాం. కొన్ని సినిమాలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చినా.... బయటకు కొందరు వ్యక్తులు అందులో తమ మనోభావాలు దెబ్బతీసే విషయాలు ఉన్నాయని ఆరోపిస్తూ సినిమాను బ్యాన్ చేయాలనే ఆందోళనలు చేస్తుండటం ఈ మధ్య కాలంలో సర్వసాధారణం అయిపోయాయి.

    అయితే కొన్ని సినిమాల విషయంలో మాత్రం సెన్సార్ బోర్డు వారే నిషేదం విధిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా చరిత్రలో 15 బాలీవుడ్ సినిమాలను సెన్సార్ బోర్డు పూర్తిగా నిషేదించింది. సదరు సినిమాల ప్రభావం భారతీయ సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో నిషేదం విధించారు.

    ఒక సినిమాపై బ్యాన్ విధించే ముందు సెన్సార్ బోర్డు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ మధ్య కాలంలో రెండు బాలీవుడ్ సినిమాలు నిషేదానికి గురయ్యాయి. ‘అన్‌ఫ్రీడమ్' పేరుతో తెరకెక్కిన చిత్రంపై నిషేదం విధించారు. ఈచిత్రాన్ని లెస్బియన్ లవర్స్ విత్ ఇస్లామిక్ టెర్రరిజం యాంగిల్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలైతే తీవ్రపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో నిషేదించారు.

    సన్నీ లియోన్ నటించిన ‘మస్తీ జాదే' సినిమా కూడా నిషేదానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. సినిమాలో వల్గారిటీ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీ మరోసారి పరిశీలిస్తోంది. గతంలో బాలీవుడ్లో నిషేదానికి గురైన చిత్రాలు స్లైడ్ షోలో....

    అన్‌ఫ్రీడమ్

    అన్‌ఫ్రీడమ్

    2015లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లెస్బియన్ లవర్స్ విత్ ఇస్లామిక్ టెర్రరిజం యాంగిల్‌లో రూపొందించారు. ఈ చిత్రం విడుదలైతే తీవ్రపరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో నిషేదించారు.

    డాజెడ్ ఇన్ దూన్

    డాజెడ్ ఇన్ దూన్

    2010 సంవత్సరంలో రత్నా పథక్ షా తెరకెక్కించిన ఈ చిత్రం దూన్ స్కూల్ లో చదువుతున్న ఓ బాలుడి స్టోరీ నేపథ్యంలో తెరకెక్కించారు. ఉత్తరఖండ్ రాష్ట్రం డెహ్రడూన్ లోని ఈ ప్రఖ్యాత పాఠశాల ఈ సినిమాపై అభ్యంతం వ్యక్తం చేసింది. సినిమా ప్రతిష్టను మసకబార్చే విధంగా సినిమా ఉందని ఆరోపించడంతో సినిమాను బ్యాన్ చేసారు.

    ఇన్‌ష‌అల్లా ఫుట్ బాల్

    ఇన్‌ష‌అల్లా ఫుట్ బాల్

    2010లో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని సెన్సార్ బోర్డు నిషేదించింది. ఇదొక కాశ్మీరీ బాలుడి కథ. అతని తండ్రి తీవ్రవాది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ బాలుడికి దేశంలో పర్యటించేందుకు అనుమతి నిరాకరించబడుతుంది. ఇది సెన్సిటివ్ మ్యాటర్ కావడంతో ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు నిషేదించింది.

    గాండు

    గాండు

    2010లో వచ్చిన ఈ బెంగాలీ చిత్రంలో ఓరల్ సెక్స్ సీన్లు, నగ్న సన్నివేశాలు ఉండటంతో బ్యాన్ చేసారు.

    ఫిరాఖ్

    ఫిరాఖ్

    గుజరాత్ అల్లర్ల మీద వచ్చిన ఈ చిత్రంపై సెన్సార్ బోర్డు నిషేదం విధించింది.

    వాటర్

    వాటర్

    దీపా మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ కథ అందించారు. వివాదాస్పద అంశాలు ఉండటంతో ఈ సినిమాను బ్యాన్ చేసారు.

    పర్జానియా

    పర్జానియా

    గుజరాత్ అల్లర్ల సందర్భంగా తప్పిపోయిన అజార్ అనే బాలుడి కథాంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాపై పలు రాజకీయ పార్టీలు గొడవ చేయడంతో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసారు.

    సిన్స్

    సిన్స్

    మహిళతో సెక్సువల్ గా ఇన్వాల్వ్ అయిన కేరళకు చెందిన ప్రీస్ట్ స్టోరీ. ఈ సినిమాపై క్యాథలిక్స్ అభ్యంతరం వ్యక్తం చేయడం, శృంగార సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉండటంతో ఈ సినిమాను నిషేదించారు.

    బ్లాక్ ఫ్రైడే

    బ్లాక్ ఫ్రైడే

    ముంబై బాంబు పేళుళ్లపై తెరకెక్కిన ఈ చిత్రానికి అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై కోర్టు కేసు ఉండటంతో విడుదల కాలేదు.

    పాంచ్

    పాంచ్

    2003లో వచ్చిన ఈ సినిమాకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు. 1997లో జోషి అభ్యాంకర్ సీరియల్ మర్డర్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హింసాత్మకంగా ఉండటం, డగ్స్ సంబంధించిన అంశాలు ఉండటంతో ఈ సినిమాను బ్యాన్ చేసారు.

    ది పింక్ మిర్రర్

    ది పింక్ మిర్రర్

    ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ సెక్సువల్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై సెన్సార్ బోర్డు నిషేదం విధించింది.

    ఉరఫ్ ప్రొఫెసర్

    ఉరఫ్ ప్రొఫెసర్

    పంకజ్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వల్గర్ సీన్లు, అసభ్యకరమైన బాష వాడటంతో సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని నిషేదించింది.

    కామసూత్ర

    కామసూత్ర

    1996లో మీరా నాయర్ దర్శకత్వంలో వచ్చిన కామసూత్ర చిత్రాన్ని...సెక్స్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కారణంతో నిషేదించారు.

    ఫైర్

    ఫైర్

    షబానా అజ్మీ, నందితా దాస్ నటించిన ‘ఫైర్' చిత్రాన్ని సెన్సార్ బోర్డు నిషేదించింది. లెస్బియన్ రిలేషన్ షిప్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంపై శివసేన ఆందోళనలు చేయడం, డైరెక్టర్ దీప మెహతాకు డెత్ వార్నింగ్ రావడంతో ఈ సినిమాను బ్యాన్ చేసారు.

    బందిత్ క్వీన్

    బందిత్ క్వీన్

    బందిపోటు క్వీన్ పూలందేవి జీవితంపై శేఖర్ కపూర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సెక్సువల్ సీన్లు, అసభ్యకరమైన లాంగ్వేజ్ కారణంగా బ్యాన్ చేసారు.

    English summary
    Bollywood movies getting banned by the Indian Censor Board is not a new thing, while most of the time they don't make sense, sometimes they do put across valid points. Two recent Bollywood films have got banned by the Indian Censor Board, one being Unfreedom which is based on lesbian lovers with an Islamic terrorism angle. The movie got accused of "igniting unnatural passions" and could release in very few states.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X