»   » రుద్రమదేవి ట్రైలర్: అల్లు అర్జున్ డైలాగ్స్ వివాదం

రుద్రమదేవి ట్రైలర్: అల్లు అర్జున్ డైలాగ్స్ వివాదం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘రుద్రమదేవి' ట్రైలర్ రానే వచ్చింది. కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన రాణి రుద్రమదేవి స్టోరీని సినిమాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో నటించారు. అయితే ట్రైలర్లో వినిపించిన కొన్ని డైలాగులు వివాదాస్పదం అయ్యాయి.

అల్లు అర్జున్, అనుష్క మధ్య జరిగే సంభాషణల్లో తెలంగాణ స్లాంగ్ ఉట్టి పడుతూ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ డైలాగుల్లో వివాదాస్పద అంశాలు దాగి ఉన్నాయనేది మరికొందరి వాదన. ముఖ్యంగా అల్లు అర్జున్ చెప్పిన ‘నేను తెలుగు బాష లెక్క. ఆడ ఉంటా, ఈడ ఉంటా' అనే డైలాగులో.....తెలంగాణ-ఆంధ్ర విభజన అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారని అంటున్నారు. ‘ఒకే తల్లి పాలు తాగినోళ్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు అయినప్పుడు ఒకే నది నీరు తాగినోళ్లు అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు కాలేరా' అంటూ అనుష్క చెప్పిన డైలాగులోనూ అదే కోణం ఉందంటున్నారు. కావాలని వివాదం రేపి సినిమాకు పబ్లిసిటీ పెంచడానికే దర్శక నిర్మాతలు ఇలాంటి డైలాగులు సినిమాలో పెట్టారని అంటున్నారు.

CONTROVERSY-Rudhramadevi Dialogues Targets Telangana Fans?

రుద్రమదేవి చిత్రాన్ని గుణశేఖర్ స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రియల్ 24న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. తెలుగు, తమిళ, మళయాల వెర్షన్ లు సైతం ఇదే రోజున విడుదల చేస్తారు.

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.'

English summary
Rudhramadevi deals with the life story of Queen Rudhramadevi of Kakatiya Dynasty. The actual story has happened in today's Warangal of Telangana State and hence the story of Rudhramadevi is also set in Telangana.
Please Wait while comments are loading...